తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YS Jagan Nomination: పులివెందులలో సీఎం జగన్ పర్యటన.. అక్కడే నామినేషన్!

వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్‌ కార్యాలయానికి చేరుకొని పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు పులివెందుల చేరుకున్న జగన్‌కు ఎంపీ అవినాష్‌ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు స్వాగతం పలికారు.

ALSO READ: మేనిఫెస్టో రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

ముగిసిన బస్సు యాత్ర..

సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లాలోని ఇడుపులపాయలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టగా.. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి సమీపంలో అక్కవరం బహిరంగ సభతో పాదయాత్ర ముగిసింది. కాగా, ఈ యాత్ర 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీల దూరం బస్సు యాత్ర సాగింది. దీంతోపాటు 16 భారీ బహిరంగ సభల్లో ప్రసంగించిన సీఎం జగన్‌.. వివిధ వర్గాల ప్రజలతో ఆరుసార్లు ముఖాముఖీ నిర్వహించారు. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర తొమ్మిది ప్రాంతాల్లో భారీ రోడ్‌ షోలు నిర్వహించారు.

ALSO READ: విశాఖ ఏపీకి డెస్టినేషన్‌.. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే?

ఎన్నికల్లో పోటీ ఏకపక్షమే..

సీఎం జగన్‌ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసింది. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 16 సభలకు లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో సీఎం జగన్‌ నిర్వహించిన రోడ్‌ షోలు అతి పెద్ద మానవ హారంగా నిలిచిపోతాయాయి. దీంతో రానునన ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కీలక నేతలు వైసీపీలోకి రావడం ప్రకంపనలు రేపుతోంది. దీంతో టీడీపీ, జనసేన నాయకుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

సంబంధిత కథనాలు

Back to top button