తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YSRCP Manifesto: మేనిఫెస్టో రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

ఏపీలో అధికార వైసీపీ పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల్లో కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాసేపట్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మలివిడత ప్రచార షెడ్యూల్‌కు పార్టీ కసరత్తు చేస్తోంది. రేపు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న జగన్‌.. ఎల్లుండి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కోఆర్డినేటర్లు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతలతో చర్చించి మేనిఫెస్టో విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ALSO READ: 23వ రోజుకు చేరిన జగన్ ‘బస్సు యాత్ర’.. శ్రీకాకుళం జిల్లా సిద్ధమా?

సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే..

నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే మరికొన్ని ఆచరణకు సాధ్యమయ్యే హామీలు, ప్రజాకర్షక పథకాలను జగన్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తామనే దానిపై మేనిఫెస్టో క్లారిటీ ఇవ్వనున్నారు. కాగా, మహిళలు, రైతులు, యువత టార్గెట్‌గా మేనిఫెస్టో ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగానే మేనిఫెస్టోలో చేర్చదగిన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆవిష్కరించనున్నారు.

ALSO READ: విశాఖ ఏపీకి డెస్టినేషన్‌.. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే?

మేనిఫెస్టో కోసం ఎదురుచూపులు

వైసీపీ మేనిఫెస్టోపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. వైసీపీ మేనిఫెస్టో కోసం జనమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో తెచ్చిన మేనిఫెస్టో జగన్‌కు బంపర్ మెజార్టీని కట్టబెట్టింది. ఈసారి అంతకుమించి మేనిఫెస్టో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ప్రజలపై పన్ను భారం పడకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయాలనేదే ముఖ్య ఉద్ధేశంగా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button