తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Memantha Siddham Bus Yatra: 23వ రోజుకు చేరిన జగన్ ‘బస్సు యాత్ర’.. శ్రీకాకుళం జిల్లా సిద్ధమా?

వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజుకు చేరుకుంది. ఉదయం అక్కివలస నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ఈ మేరకు జగన్ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనుంది. రోడ్ షో ద్వారా ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్న పేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరుశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు.

ALSO READ: విశాఖ ఏపీకి డెస్టినేషన్‌.. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే?

ఇడుపులపాయ టూ ఇచ్చాపురం

వై నాట్ 175 టార్గెట్‌గా జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైంది. సభలు, వివిధ వర్గాలతో ముఖాముఖీలు, రోడ్‌ షోలు, జనానికి ఆత్మీయ పలకరింపులతో జగన్‌ బస్సు యాత్ర సాగింది. ఈ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మండుటెండలోనూ సీఎం జగన్‌కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఇప్పటివరకు 21 రోజుల పాటు 22 జిల్లాల్లో సాగిన బస్సు యాత్రలో 15 భారీ బహిరంగ సభల్లో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగించారు. కాగా, ఈ యాత్ర సాయంత్రం ఇచ్ఛాపురం చేరనుంది. ఆ తర్వాత హెలిప్యాడ్‌ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్.. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకోనున్నారు.

ALSO READ: ఎన్ని కూటములు జత కట్టినా కష్టమే.. ఎన్నికల వేళ లావాదేవీలతో స్పష్టం చేసిన బాలకృష్ణ!

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..

పులివెందుల అభ్యర్థిగా రేపు జగన్ నామినేషన్‌ వేయనున్నారు. ఉదయం గన్నవరం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌.. ఉదయం 11 గంటల ప్రాంతంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అంతకుముందు పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలో అంతకుమించి అన్నట్లు ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతీరోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనేలా సీఎం జగన్‌ ప్రచార షెడ్యూల్‌ సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button