తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ఎన్ని కూటములు జత కట్టినా కష్టమే.. ఎన్నికల వేళ లావాదేవీలతో స్పష్టం చేసిన బాలకృష్ణ!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి కచ్చింతంగా అధికారంలోకి వస్తుందా! అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల పలు సర్వేల్లోనూ వైసీపీ గెలుస్తుందని తేల్చడంతో టీడీపీ నాయకుల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సైతం ఓడిపోతామని ముందే తెలిసినట్లుంది. అందుకేనేమో.. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత బాలకృష్ణ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలిసింది. కానీ ఇక్కడ రాజధానిని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరి బాలకృష్ణ మాత్రం రుషికొండ బీచ్‌రోడ్‌లో రూ.65 కోట్లతో జనవరిలో ఓ స్థలాన్నికొనుగోలు చేశాడు. ఈ స్థలం కొనుగోలు చేసేందుకు అప్పటికప్పుడు కొత్త కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఉంది. ఇందులో బాలకృష్ణ, ఆయన కుటుంబీకులకే వంద శాతం వాటా ఉండడం గమనార్హం.

ALSO READ: వైసీపీ మేనిఫెస్టోపై కూటమికి భయం.. కాసేపట్లో ఫైనల్ చేయనున్న సీఎం జగన్

ఎక్కడెక్కడ కొనుగులు చేశాడంటే?

ఎన్నికల ముందు విశాఖ నుంచే జగన్ పాలన కొనసాగిస్తారని టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ లావాదేవీలతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సరిగ్గా రెండు నెలల కిందట రుషికొండలో రెండెకరాలకు పైగా స్థలం కొనుగోలు చేసిన బాలయ్య.. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో కొనుగోలు చేశాడు. దాదాపు రూ.6.5 కోట్లకు కొనుగోలు చేయగా.. రూ.2.4 కోట్లకు పడిపోయింది. ఇప్పుడు టీడీపీ గెలుస్తుందనే ఆశ లేదని, అమరావతిపై టీడీపీకి సైతం ఆశలు పోయినందున బాలకృష్ణ రుషికొండలో స్థలం కొనుగోలు చేసి ఉంటారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాజధానిగా అమరావతి ప్రాంతం సరైనది కాదని, అన్ని అర్హతలు విశాఖపట్నంకు ఉన్నాయని బాలయ్యకు తెలుసు. అందుకే విశాఖలో ఆయన వియ్యంకుడికి చెందిన గీతం కళాశాల చైర్మన్, విద్యావేత్త కోనేరు రామకృష్ణారావు కుటుంబీకులకు చెందిన స్థలం పక్కన కొనుగోలు చేసేందుకు బాలకృష్ణ అల్లుడు డీల్‌ చేసినట్లుగా సమాచారం. అయితే వైజాగ్‌లో ఇంకా ఎక్కడెక్కడ కొన్నాడు? ఎన్ని కొనుగోలు చేశాడో తెలియాల్సి ఉంది. మరి వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సమాచారం బాలయ్యకి లోకేష్ ఇచ్చాడా? లేదా కూతురు బ్రాహ్మణి ఇచ్చిందా? అనే వార్తలు వస్తున్నాయి.

ALSO READ: సీఎం జగన్ హామీతో లక్షా నలభై వేల మంది వాలంటీర్లు రాజీనామా!

బాలయ్య కుటుంబానికే 100 శాతం షేర్లు!

రుషికొండలో మంచి స్థలం చూడాలని ఈ ఏడాది జనవరిలో బాలకృష్ణ తన కుటుంబ సభ్యులను కోరినట్లు తెలిసింది. కాగా, కోనేరు కుటుంబీకులంతా దాదాపుగా విదేశాల్లో ఉండటంతో వారికి చెందిన 10,255 చదరపు గజాల (2.15 ఎకరాలు) బీచ్‌రోడ్‌కు అభిముఖంగా ఉన్న స్థలాన్ని జనవరిలోనే బాలకృష్ణ రూ.65 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ స్థలం కొన్న విషయం బయటకు రాకుండా బాలయ్య అప్పటికప్పుడు తన కుటుంబానికే 100 శాతం షేర్లుండేలా ఎన్‌బీకే క్లాసిక్‌–2 అనే ఓ లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ పేరు మీద భూమి కొనుగోలు చేసి బాలకృష్ణ 25 శాతం,హెచ్‌యూఎఫ్‌ కర్తగా 30 శాతం, ఆయన భార్యాపిల్లలకు మిగిలిన 45 శాతం వాటాలున్నాయి. తాజాగా, ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్థలం కొనుగోలు లావాదేవీలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button