తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YSRCP Manifesto 2024: వైసీపీ మేనిఫెస్టోపై కూటమికి భయం.. కాసేపట్లో ఫైనల్ చేయనున్న సీఎం జగన్

ఏపీలో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో దాదాపుగా ఖరారైంది. ఇందులో భాగంగానే ఇవాళ ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఆ పార్టీ కీలక నేతలతో మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు మేనిఫెస్టో అంశంపై చర్చిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మీటింగ్ అనంతరం మేనిఫెస్టోను సీఎం జగన్ ఫైనల్‌ చేయడంతోపాటు వీలైనంత త్వరగా రెండు, మూడురోజుల్లోనే మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో సిద్దం సభలు నిర్వహించిన సీఎం వైఎస్.. ప్రస్తుతం ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర 24వ తేదీతో ముగియనుంది.

ALSO READ:  వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం.. రేపే మేనిఫెస్టో ఫైనల్!

నవరత్నాలు 2.0..

వైసీపీ మేనిఫెస్టోలో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎజెండా ప్రత్యేకంగా ఉండొచ్చని, ఈసారి మేనిఫెస్టో నవరత్నాలను మించి నవరత్నాలు 2.0గా ఉండనుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పేదలకు సంక్షేమం అందించినట్లే ఈసారి మధ్యతరగతి వర్గాలను ఉద్దేశించి మేనిఫెస్టోలో వరాలు ఉంటాయనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ బయటకు రాలేదు. ఈ ప్రశ్నలన్నిటికీ కాసేపట్లో సమాధానం తెలవనుంది. సిద్ధం సభల్లోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. ఈనెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు.

ALSO READ: విశాఖలో రోడ్ షో..ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ!

మేనిఫెస్టోపై భారీ అంచనాలు

రాష్ట్రంలో మేనిఫెస్టోపై రాజకీయంగా భారీ అంచనాలు ఉన్నాయి. టీడీపీ గత మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోల కిచిడీలాగా తయారైందని ప్రజలు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ దశలోనే వైసీపీ మేనిఫెస్టోపై భారీ అంచనాలున్నాయి. గతంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేసి చూపించిన జగన్.. ఈసారి కూడా నవరత్నాలకు మించిన పథకాలతో ప్రజల ముందుకొచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మేనిఫెస్టోపై కూటమికి భయం పట్టుకుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button