తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: సీఎం జగన్ హామీతో లక్షా నలభై వేల మంది వాలంటీర్లు రాజీనామా!

సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి స్పష్టమైన హామీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్లలో అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటికే లక్షా నలభై వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. మరో వారం రోజుల్లో 50 నుంచి 60 వేల మంది కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ నెలాఖరు నాటికి అందరూ వాలంటీర్లు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైన మరుక్షణమే ఇప్పుడు రాజీనామా చేసిన ప్రతి ఒక్క వాలంటీరును ప్రత్యేక జీఓ విడుదల చేసి మరి తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు వాలంటీర్లందరికీ సీఎం జగన్ భరోసా కల్పించారు. అయితే, రాజీనామాలు చేయకుండా, ఎవరైతే వైసీపీకి సహకరించకుండా వ్యవహరిస్తున్నారో.. వారికి సంబంధించిన అన్ని వివరాలను స్థానిక నేతలతో పాటు, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. అలాంటి వారిపై వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దృష్టిసారించే అవకాశం ఉంది.

వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర.. సెల్ఫ్ గోల్!

వాలంటీర్లపై అన్ని రకాలుగా కక్షపూరితంగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ చివరికి ఈ విషయంలో సాధించింది ఏముందంటే ఏమీ లేదనే చెప్పాలి. వాలంటీర్ వ్యవస్థను సమూలంగా రూపు మాపాలని, ప్రజల పట్ల, వైసీపీ పట్ల వాలంటీర్లకు ఏర్పడిన అనుబంధాన్ని తుడిచివేయాలని భావించిన చంద్రబాబు చివరికి తానే బొక్కా బోర్లా పడ్డారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాలంటీర్ల చేత పెన్షన్లు పంపిణీ చేయడాన్ని ఆపించేసిన చంద్రబాబు.. అంతకుమించి ఏమీ చేయలేక పోయారు.

Also Read: దారిపొడవునా జనవాహిని.. వైసీపీలోకి పెరుగుతున్న వలసలు!

చంద్రబాబు మాయమాటలను నమ్మని వాలంటీర్లు!

చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఈసీ తప్పించింది. దీంతో వృద్ధులు, వికలాంగులు, మహిళలు పెన్షన్ల పంపిణీ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారో ప్రజలకు మరొకసారి స్పష్టమైంది. దీంతో వాలంటీర్లపై కక్షకట్టిన చంద్రబాబును అందరూ ఛీకొట్టారు. చివరికి బాబు చేసేదేమీ లేక.. ఏ వ్యవస్థనైతే తాను ఉండొద్దని అనుకున్నారో.. చివరికి అదే వాలంటీర్లకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకు రూ. పది వేలు ఇస్తామని ప్రకటించారు. కానీ చంద్రబాబు మాయ మాటల్ని ఏ ఒక్క వాలంటీర్ కూడా నమ్మడం లేదు. తమకు వాలంటీర్లుగా అవకాశం కల్పించి, తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్మోహన్ రెడ్డినే తాము నమ్ముతామని, జగన్ కే ఎళ్లవేళలా తమ మద్దతు ఉంటుందని ముక్తకంఠంతో చెబుతున్నారు.

26 Comments

    1. Jagan Anna miru chesthunna seva lo menu kuda oka sevakudi ga vunnaamdhuku chala hpy ga vundhi.na cluster lo oka single person ki over drink cheyyadam tho health issue vachi hosp lo admit chesthe aarogya sree card lo apply chesina 24hrs lo card ravadam treatment cheyyadam jarigindhi Anna. Dr. YSR Sir introduce chesina 108 means Bible vundhi Mathew 10.8 lo chanipoena vaarina lepudi,rogulanu swasthyaparachudi ani.2024,2029 lo kuda more CM avthaaru Anna. God blesings miku yeppudu vunttaai anna

  1. Super anna nv malli malli nv ravali na lanti pedha kutubhani adhukovali ani oka volienteer ga chapputhunnanu andukanta naku ma ayyana lakapoyana nv pettena volienteer job tho brathukuthunnanu iddaru pillalutho jai jagan

  2. Jagan Anna …meeru pravesha pettina ,volunteer ,vyavastha ,Chala goppadi ….
    Nenoka Samanya barber shop,run chesthunnanu …kutumbam , nettuku vache kramam, dabbu saripoledu ,meeru volunteer ga mamalni thiskunnaka …Seva tho paatu ,3 putala ma kutumbam bojanam chesthunnam Anna …na lanty peda kutumbala jeevithalo velugulu nimparu
    ..thirigi meere ravali Anna ….

  3. Love u jagan jagan anna malli malli nuvve CM kavali jagan anna me dhyavla meru pravesapettina e volunter job thone na kutumbani posinchukuntunna malli Nv CM ga ravali ma jevethalo velugulu nepali anna♥

  4. Jagan Anna miru chesthunna seva lo menu kuda oka sevakudi ga vunnaamdhuku chala hpy ga vundhi.na cluster lo oka single person ki over drink cheyyadam tho health issue vachi hosp lo admit chesthe aarogya sree card lo apply chesina 24hrs lo card ravadam treatment cheyyadam jarigindhi Anna. Dr. YSR Sir introduce chesina 108 means Bible vundhi Mathew 10.8 lo chanipoena vaarina lepudi,rogulanu swasthyaparachudi ani.2024,2029 lo kuda more CM avthaaru Anna. God blesings miku yeppudu vunttaai anna

  5. మేము సర్వీస్ చేస్తుండగానే 36 సంవత్సరాలు వచ్చాయి రాజీనామా చేస్తే మరల జాబ్ లోకి తీసుకుంటారా

  6. 175/175 MLA Thappakunda vosthai 25 Mp seats Gelichi History Create cheyaboye Roju June 4th Anna.

  7. మంచి నిర్ణయం…
    జై జగనన్న…
    సాహో జగనన్న….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button