తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

AP Elections: దారిపొడవునా జనవాహిని.. వైసీపీలోకి పెరుగుతున్న వలసలు!

వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. 18వ రోజు ఎస్‌టీ రాజపురం ప్రాంతం నుంచి కాకినాడ వరకు రోడ్డుకు ఇరువైపులా మానవహారంలా నిలబ­డి సీఎం జగన్‌ను ఆశీర్వదించారు. మండుటెండలను లెక్క చేయకుండా సీఎం జగన్ చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నేతకు రాని విధంగా జగన్ యాత్రకు ఇంత జనసందోహాన్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

ALSO READ: 18వ రోజుకు చేరిన సీఎం జగన్ ‘బస్సు యాత్ర’..దారిపొడవునా ఘన స్వాగతం

టీడీపీ, జనసేనకు షాక్

కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద టీడీపీ, జనసేన నాయకులు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ మేరకు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరిన వారిలో జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

ALSO READ: జగన్‌కు రోజురోజుకి పెరుగుతున్న జనాదరణ.. తీవ్ర నిరాశలో టీడీపీ కూటమి!

గుంటూరులోనూ వలసలు..

గుంటూరు ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి గట్టి షాక్ త‌గిలింది. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్‌.టి.రాజపురం వద్ద టీడీపీ కీల‌క నేత‌లు పార్టీని వీడారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆధ్వ‌ర్యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఈ మేరకు జగన్ వారందరినీ ఆప్యాయంగా ప‌లుక‌రించి, కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరిన వారిలో మాజీ కార్పొరేట‌ర్ ఎస్‌.కెసైదా, మొండి బండ సంఘం జిల్లా అధ్య‌క్షుడు పి.కృష్ణ‌, టీడీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేక‌ల మాధ‌వ‌యాద‌వ్ తదితరులున్నారు.

సంబంధిత కథనాలు

Back to top button