తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YS Jagan: గొడిచర్ల నుంచి ప్రారంభమైన ‘బస్సు యాత్ర’.. పార్టీ నేతలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం

వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు గోడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్ అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం వరకు బస్సుయాత్ర కొనసాగనుంది. రాత్రి చిన్నయపాలెంలో బస చేయనున్నారు.

ALSO READ: దారిపొడవునా జనవాహిని.. వైసీపీలోకి పెరుగుతున్న వలసలు!

సీఎం జగన్‌ దిశానిర్దేశం

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం గొడిచర్ల నైట్ స్టే పాయింట్ వద్ద పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల వైసీపీ నేతలు సీఎం జగన్‌ కలిశారు. ఇందులో భాగంగా పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను సీఎం జగన్ పేరుపేరునా పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. అంతకుముందు సీఎం జగన్‌కు వైసీపీ కార్యకర్తలు, గొడిచర్ల గ్రామస్థులు బస్సు ముందు నిల్చుని స్వాగతం పలికారు. కాగా, అనకాపల్లి జిల్లా సిద్ధమా..? అంటూ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button