తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Memantha Siddham Bus Yatra: ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న ‘బస్సు యాత్ర’.. వైసీపీ ప్రత్యేక వ్యూహం?

‘వై నాట్ 175’ నినాదంతో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం‘ బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ జనం ముక్తకంఠంతో చెబుతున్నారు. దారి పొడవునా అభిమానులు సందడి కనిపిస్తోంది. పులపర్తి దాటిన సీఎం జగన్ బస్సు యాత్ర.. కాసేపట్లో యలమంచిలి బై పాస్‌కు చేరుకోనుంది. కాగా, అంతకుముందు అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్‌ స్టే పాయింట్ వద్ద అమలాపురం జనసేన పార్టీ సీనియర్ నేతలు ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్, డీఎం ఆర్ శేఖర్‌, దుర్గాభవాని తదితరులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ALSO READ: గొడిచర్ల నుంచి ప్రారంభమైన ‘బస్సు యాత్ర’.. పార్టీ నేతలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం

ఆ జిల్లాలపై ఫోకస్

రాయలసీమలో పట్టు తగ్గకూడదని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్..కోస్తాతోపాటు ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా 68 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొందిన వైసీపీ..ఈ సారి కూడా ఏకపక్షంగా విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన 23 స్థానాలు, జనసేన గెలిచిన ఒక్క స్థానంతోపాటు మరో 24 స్థానాల్లో 10వేల కంటే తక్కువ మెజారిటీ ఉన్న స్థానాలు 44 వరకు ఉన్నాయి. ఈ 44 స్థానాల్లో 5వేల కంటే తక్కువ మెజారిటీ స్థానాలు 12 ఉన్నాయి. అందుకే ఈ స్థానాలపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button