తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

CM Jagan: జగన్‌కు రోజురోజుకి పెరుగుతున్న జనాదరణ.. తీవ్ర నిరాశలో టీడీపీ కూటమి!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘సిద్ధం’ సభలకు, అలాగే ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు అసలు ప్రజలే రారని, ఒకవేళ వచ్చినా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే వస్తారు గానీ, టీడీపీ ప్రాబల్యం ఉందని వారు అనుకుంటున్న గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి వంటి జిల్లాల్లో ఎవరూ రారని టీడీపీ, కూటమి నేతలు అవాకులు, చవాకులు పేలారు. దీనికి ‘యెల్లో’ మీడియా కూడా వత్తాసు పలికిన విషయం మనం చూశాం. అయితే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సభలకు వస్తున్న జనాన్ని, వైసీపీని ఆదరిస్తున్న ప్రజల్ని చూసి అలా మాట్లాడిన వారికి ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు.

ALSO READ: ‘పక్కా తెలుగు’ గ్రౌండ్ రిపోర్ట్.. వైసీపీకి 112 సీట్లు!

టీడీపీ, జనసేన ఉమ్మడి సభల కంటే, వైసీపీ సభలకు జనం రెట్టింపు!

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు, సభలకు రాయలసీమలో వచ్చిన కంటే రెట్టింపు సంఖ్యలోనే గుంటూరు, కృష్ణ జిల్లాల సభలకు వచ్చారు. ఇక అమరావతి రాజధాని ప్రాంతంలోనైతే ప్రజలు పెద్దఎత్తున జగన్ యాత్రకు మద్దతు పలికారు. మరోసారి జగనే సీఎం కావాలంటే ముక్తకంఠంతో నినదించారు. ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బస్సుయాత్ర కొనసాగుతోంది. ఈ జిల్లాలోని ప్రజలు జగన్‌కి ఏకంగా హారతులు పడుతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. నిన్న కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ, జనసేన నిర్వహించిన ఉమ్మడి బహిరంగ సభ కంటే, అదే జిల్లాలోని గుడివాడలో మొన్న వైసీపీ నిర్వహించిన ‘మేమంతా సిద్ధ’ బహిరంగ సభకు రెండింతల జనం హాజరయ్యారు.

ALSO READ: ‘తెలుగు దేశం పార్టీ’ తమ్ముళ్లలో తగ్గిన జోష్.. బెట్టింగుల్లో వెనుకంజ!

ఓటమిని ముందే గ్రహించిన కూటమి!

ఈ పరిస్థితుల నేపథ్యంలో కూటమి నేతలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. తాము బలంగా ఉన్నామనుకున్న కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ గాలే వీస్తుండటంతో వారికి ఏం చేయాలో తోచడం లేదు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఎన్నికల్లో ఏం చేసినా తాము గెలిచే అవకాశం లేదని భావించిన కూటమి నేతలు చివరికి జగన్ మీద దాడి జరిగినా.. దిగజారుడు వ్యాఖ్యలు చేసి, ప్రజల్లో మరింత చులకనయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button