తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

TDP: ‘తెలుగు దేశం పార్టీ’ తమ్ముళ్లలో తగ్గిన జోష్.. బెట్టింగుల్లో వెనుకంజ!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. అధికార వైసీపీ, టీడీపీ నేతృత్వంలోని కూటమి మధ్య ఈసారి తీవ్ర పోటీ ఉంటుందని వార్తలు వచ్చినా అవన్నీ ఉత్తుత్తి వార్తలేనని ఇటీవల వెలువడుతున్న సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వెలువడిన ఏ సర్వే చూసినా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పేశాయి. దీంతో తెలుగు దేశం పార్టీ తమ్ముళ్లను తీవ్ర అసహనం కమ్మేస్తోంది. మొన్నటిదాకా టీడీపీనే అధికారంలోకి వస్తుందని కోట్ల రూపాయల బెట్టింగులు కాసిన తమ్ముళ్లు ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయారు.

ALSO READ: ‘పక్కా తెలుగు’ గ్రౌండ్ రిపోర్ట్.. వైసీపీకి 112 సీట్లు!

అప్పుడు 1 : 3 బెట్టింగ్.. ఇప్పుడేమో 1 : 1కి కూడా ‘నో’

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని, ఇక్కడ కూడా అధికార మార్పిడి జరిగి టీడీపీ పక్కాగా అధికారంలోకి వస్తుందని తెలుగు తమ్ముళ్లు తీవ్ర ప్రచారం చేశారు. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి ఈ ఎన్నికల్లో టీడీపీనే కచ్చితంగా గెలుపొందుతుందని తెగ బెట్టింగులు కాశారు. ఏకంగా 1 : 3 (ఒకటికి మూడింతలు: అంటే రూపాయి పెడితే మూడు రూపాయలు అన్నమాట) అనే స్థాయిలో బెట్టింగులు వేశారు. టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు, ఆ పార్టీ ఎన్ఆర్ఐ నేతలు కోట్ల రూపాయలను బెట్టింగుల్లో పెట్టారు. కానీ ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది.

ALSO READ: ముహూర్తం ఖరారు.. 25న సీఎం జగన్ నామినేషన్

జగన్‌పై దాడి ఘటనతో భారీగా పడిపోయిన కూటమి గ్రాఫ్

సీఎం జగన్మోహన్ రెడ్డి ‘సిద్ధం’ సభలతో జనంలోకి వెళ్లిన నేపథ్యంలో ఆయనకు ప్రజల్లో రోజురోజుకి పెరుగుతున్న ఆదరణను చూశాక, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని కుమ్ములాటలు బయటపడ్డ తర్వాత తెలుగు తమ్ముళ్లకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీకి ఓటమి తప్పదని వారికి అర్థమైపోయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద మొన్నటి దాడి ఘటనలో కూటమి నేతలు చేసిన వ్యాఖ్యల్ని ప్రజలు ఛీదరించుకున్నారు. సాక్షాత్తూ సీఎం మీద దాడి జరిగినా.. దిగజారి ప్రవర్తించడంపై కూటమి నేతలు ప్రజల్లో మరింత చులకనయ్యారు. దీంతో టీడీపీ, కూటమి గ్రాఫ్ బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ అంటేనే తెలుగు తమ్ముళ్లు జంకే పరిస్థితి నెలకొంది. అప్పుడు ఎంతో హుశారుగా 1 : 3 బెట్టింగులు కట్టిన వారు, ఇప్పుడు 1 : 1కి కూడా ‘నో’ చెబుతున్నారట. ఎలాగూ ఓడిపోయే టీడీపీ మీద బెట్టింగ్ కట్టి ఎందుకు నష్టపోవాలని ఆలోచిస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button