తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

YCP: ‘పక్కా తెలుగు’ గ్రౌండ్ రిపోర్ట్.. వైసీపీకి 112 సీట్లు!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రపదేశ్ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతృత్వంలోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) పోటాపోటీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఈ సందర్భంగానే వెలువడుతున్న పలు సర్వేలు, రిపోర్టులు అధికార పక్షంలో ఉత్సాహాన్ని నింపితే, కూటమిలో మాత్రంలో తీవ్ర నిరాశను నింపుతున్నాయి. ఈ మధ్యనే వెలువడిన పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే, స్వతంత్ర టీవీ, ది పయోనీర్‌తో సహా ఏ సర్వే అయినా రాష్ట్రంలో మరోసారి వైసీపీకే అధికారం దక్కుతుందని స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే ‘పక్కా తెలుగు’ గ్రౌండ్ రిపోర్టు అనాలిసిస్ కూడా తాజాగా వెలువడింది.

జిల్లాల వారీగా ‘పక్కా తెలుగు’ గ్రౌండ్ రిపోర్ట్

మొత్తం 13 ఉమ్మడి జిల్లాల వారీగా ‘పక్కా తెలుగు’ గ్రౌండ్ రిపోర్ట్ అనాలిసిస్‌‌ను విడుదల చేసింది. దీని ప్రకారం వైసీపీ మొత్తం 110 – 112 స్థానాల్లో గెలుపొంది, మరోసారి అధికారం చేపడుతుందని అంచనా వేసింది. ఇక, కూటమి మాత్రం కేవలం 32 స్థానాలకే పరిమితమవుతుందని స్పష్టంచేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ గ్రౌండ్ రిపోర్టును చేపట్టినట్లు తెలిపింది. ఏ రకంగా చూసినా 2 – 3 ఓటు శాతం తేడాతో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పింది.

పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కుట్రలు.. భారీగా పడిపోయిన కూటమి గ్రాఫ్

కూటమిలో కుమ్ములాటలు, వృద్ధులు, వికలాంగులు, మహిళలకు పెన్షన్ పంపిణీ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు, వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయకుండా ఎన్నికల సంఘానికి కూటమి నేతలు ఫిర్యాదు చేయడం వంటివి కూటమి మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపినట్లు ‘పక్కాతెలుగు’ గ్రౌండ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అలాగే సీఎం జగన్ మీద జరిగిన దాడి గురించి సైతం ఆయా పార్టీల నేతలు చులకనగా మాట్లాడటం కూడా కూటమి గ్రాఫ్ భారీగా పడిపోయేలా చేసిందని తెలిపింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఓసారి పరిశీద్దాం.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

ఉమ్మడి జిల్లావైసీపీటీడీపీ కూటమిపోటాపోటీ
శ్రీకాకుళం721
విజయనగరం711
విశాఖపట్టణం744
తూర్పు గోదావరి865
పశ్చిమ గోదావరి744
కృష్ణా844
గుంటూరు944
ప్రకాశం822
నెల్లూరు901
చిత్తూరు1022
అనంతపురం932
కర్నూలు1301
కడప1000
మొత్తం1123231

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button