తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ (19 April 1956) పుట్టిన రోజు నేడు. ఈమె 2009 పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2011 నుండి 2022 వరకు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈమె కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం సీఎం బాధ్యతను నిర్వర్తిస్తున్నారు . కుమార్తె వైఎస్ షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు.

ముకేష్ అంబానీ బర్త్ డే

ప్రపంచ కుబేరుల్లో ఒకరు. భారత్‌లోని దిగ్గజ వ్యాపారవేత్తలో ఒకరు. దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆసియాలో రెండో అతిపెద్ద ధనవంతుడు. పరిచయం అవరసంలేని పేరు ఆయనది. దేశంలోని అత్యంత విలువైన కంపెనీకి అధినేత. ఆయన మరెవరో కాదు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ ధీరూభాయ్ అంబానీ. ఆయన ఏప్రిల్ 19న 67వ ఏటలోకి అడుగుపెట్టారు. మార్చి 2024 నాటికి $113.7 బిలియన్ల నికర విలువతో, అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలో 11వ ధనవంతుడిగా నిలిచారు.

Also Read: ‘తెలుగు దేశం పార్టీ’ తమ్ముళ్లలో తగ్గిన జోష్.. బెట్టింగుల్లో వెనుకంజ!

హీరోయిన్ స్వాతి రెడ్డి ( కలర్స్ స్వాతి) పుట్టిన రోజు

హీరోయిన్ స్వాతి రెడ్డి ( 19 ఏప్రిల్ 1987 ) మా టీవీలో ప్రసారమైన కలర్స్ షో ద్వారా గుర్తింపు పొందారు. తెలుగులో అష్టా చమ్మా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించడమే కాకుండా ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఉత్తమ నటిగా నంది అవార్డును పొందారు. ఈమె తెలుగుతో పాటు తమిళం, మలయాళ చిత్రాలలో కూడా నటించారు. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, స్వామి రా రా, కార్తికేయ వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి.

చార్లెస్‌ డార్విన్‌ వర్థంతి

ఖగోళ భౌతిక శాస్త్రంలో కోపర్నికస్‌ ప్రతిపాదించిన ‘సూర్య కేంద్ర సిద్ధాంతానికి’ ఎంత ప్రాముఖ్యత ఉందో, అంతే ప్రాధాన్యత ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త డార్విన్‌ ‘జీవ పరిణామ సిద్ధాంతానికి’ ఉంది. చార్లెస్‌ రాబర్ట్‌ డార్విన్‌ (1809 ఫిబ్రవరి 12 – 1882 ఏప్రిల్ 19) ఐదేళ్లు ప్రపంచయానం చేసి వివిధ వృక్ష జంతుజాతులను పరిశీలించి 1859లో ‘ఆన్‌ ది ఆరిజన్‌ ఆఫ్‌ స్పీసీస్‌’ (జీవజాతుల ఉత్పత్తి) అనే గ్రంథాన్ని ప్రచురించారు.

Also Read: ముహూర్తం ఖరారు.. 25న సీఎం జగన్ నామినేషన్

మరికొన్ని విశేషాలు

  • హీరోయిన్ ఈషా రెబ్బ ఏప్రిల్ 19,1990 లో జన్మించారు. ఫేస్‌బుక్‌లో ఆమె ఫోటోలు చూసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఆమెను అంతకు ముందు… ఆ తరువాత… చిత్రంలో నటించటానికి అవకాశం కల్పించాడు. ఆ తర్వాత బందిపోటు, అమి తుమి, అ!, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మామా మశ్చీంద్ర వంటి చిత్రాల్లో నటించింది.
  • 1975లో భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ ను ప్రయోగించారు.
  • తెలుగు రంగస్థల, సినిమా నటుడు నాగభూషణం ఏప్రిల్ 19,1921 న జన్మించారు. ఆయన టాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా విలన్ పాత్రలను పోషించేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button