తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం
Trending

ఏప్రిల్ 28: చరిత్రలో ఈరోజు

ప్రపంచ పశు వైద్య దినోత్సవం

ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తుంటారు. పశువుల నుంచి మానవులకు సంక్రమించు కొన్ని వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కాళ్ళకూరి నారాయణరావు పుట్టినరోజు

నాటకకర్త, సంఘసంస్కర్త కాళ్ళకూరి నారాయణరావు 1871 పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరము మండలం మత్స్యపురి గ్రామంలో జన్మించారు. ఈయనకు మహాకవి అనే బిరుదు ఉంది. వీరు నటించిన నాటకాలలో చింతామణి, వర విక్రమం, మధుసేవ బాగా ప్రసిద్ధి చెందాయి. సినిమాలు తీయగా మంచి విజయం సాధించాయి.

ఎ.జి. కృష్ణమూర్తి పుట్టినరోజు

ముద్రా కమ్యూనికేషన్స్ సంస్థాపక అధ్యక్షుడు, కాలమిస్టు, రచయిత ఎ.జి. కృష్ణమూర్తి 1942 గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఇంగ్లీష్, తెలుగులో ఈయన రాసిన పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించబడ్డాయి. భారతీయ ఇతర భాషల్లోకి అనువదించారు. వివిధ కంపెనీల్లో అడ్వర్టైజింగ్ విభాగంలో పనిచేశారు. 1980 మార్చి 25న తన సొంత వ్యాపార ప్రకటన సంస్థ ముద్రా కమ్యూనికేషన్స్ ను ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్లలో ముద్రా భారతదేశంలో ఉన్న పెద్ద వ్యాపార ప్రకటనా సంస్థలలో మూడో స్థానంలో, స్వదేశీ వ్యాపార ప్రకటనా సంస్థలలో మొదటి స్థానంలో నిలిచింది.

జేమ్స్ మన్రో పుట్టినరోజు

అమెరికా వ్యవస్థాపక పితామహుడు, రాజనీతిజ్ఞుడు, న్యాయవాది, దౌత్యవేత్త, అమెరికా ఐదవ అధ్యక్షుడు జేమ్స్ మన్రో 1758 బ్రిటిష్ అమెరికాలోని వర్జీనియా మన్రోహాల్ లో జన్మించారు. 1817- 1825 వరకు అమెరికా దేశ అధ్యక్షుడిగా పనిచేశారు.

కెన్నెత్ కౌండా పుట్టినరోజు

రాజకీయ నాయకుడు, జాంబియా దేశ మొదటి అధ్యక్షులు కెన్నెత్ కౌండా 1924 ప్రస్తుత జాంబియాలోని ఉత్తర రోడేషియా చిన్సాలీలో జన్మించారు. 1964- 1991 జాంబియా దేశానికి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలన నుండి నార్తర్న్ రోడేసియన్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ హ్యారీ నకుంబల నాయకత్వంపై అసంతృప్తితో విడిపోయి జాంబియన్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ను స్థాపించారు. తరువాత సోషలిస్ట్ యునైటెడ్ నేషనల్ ఇండిపెండెన్స్ పార్టీ అధినేత అయ్యారు.

సమంత పుట్టినరోజు

భారతీయ ప్రముఖ నటి సమంత 1987 చెన్నైలో జన్మించారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. కెరీర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేశారు. 2010లో వచ్చిన ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్ట, అత్తారింటికి దారేది సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

హుమాయున్ పుట్టినరోజు

బంగ్లాదేశ్ రచయిత, కవి, పండితుడు, భాషావేత్త హుమాయున్ ఆజాద్ 1947 అప్పటి బ్రిటీష్ ఇండియా బెంగాల్ రాజ్యం మున్షీగంజ్ రార్హికల్ లో జన్మించారు. ఆయన అసలు పేరు హుమయూన్ కబీరా. సుమారు 70కి పైగా రచనలు చేశారు. మతపరమైన ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా ఆయన చేసిన రచనలకు సానుకూల, ప్రతికూలంగా అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ముస్సోలినీ మరణం

ఇటలీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు, ఇటలీ మాజీ ప్రధాని ముస్సోలినీ 1945 ఇటలీలోని గియూలినో డి మెజ్జాగ్రాలో మరణించారు. ఈయన పూర్తి పేరు బెనిటో అమిల్ కేర్ ఆండ్రియా ముస్సోలినీ. ఈయన 1883 ఇటలీలోని ఫోర్లై ప్రెడాప్పియోలో జన్మించారు. జాతీయ ఫాసిస్టు పార్టీని నడిపించారు. ఫాసిజంను సృష్టించిన వారిలో అగ్రస్థానంలో ఉంటారు. 1922లో ఇటలీకి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్, జర్మనీతో కలిసి యుద్ధంలో పాల్గొన్నారు.

రమకాంత్ దేశాయ్ మరణం

భారత మాజీ క్రికెటర్ రమాకాంత్ దేశాయ్ 1998 ముంబైలో మరణించారు. 1959లో టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్రం చేసి ఫాస్ట్ బౌలర్ గా సేవలందించిన రమకాంత్ 1939 జూన్ 30న ముంబాయిలో జన్మించారు. వెస్టిండీస్ తో ఆడిన తొలి టెస్టులోనే 49 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టాడు. 1959 ఇంగ్లాండు, 1961-62 లో వెస్టిండీస్, 1967-68లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లో పర్యటించిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రమకాంత్ మొత్తం 28 టెస్టులు ఆడి 37.31 సగటుతో 74 వికెట్లు సాధించారు. బ్యాటింగ్ లో 13.48 సగటుతో 418 పరుగులు చేశారు. 1996-97 మధ్య భారత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు.

మరిన్ని విశేషాలు

ప్రముఖ రచయిత, నటుడు, నాటకకర్త భమిడిపాటి కామేశ్వరరావు 1897 ప.గో. జిల్లా ఆకివీడులో జన్మించారు.

నక్సలైట్ నాయకుడిగా మారిన కవి గంటి ప్రసాదరావు 1947 విజయనగరం జిల్లా బొబ్బిలిలో జన్మించారు.

దక్షిణ భారత చలనచిత్ర నటి విదిశ శ్రీ వాస్తవ ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జన్మించారు.

మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా బాజీరావ్ మస్తానీ 1740 మరాఠా సామ్రాజ్యం సిన్నార్ దుబెరే ప్రాంతంలో జన్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button