తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 26: చరిత్రలో ఈరోజు

ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం

ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. ప్రపంచంలో పేటెంట్లు, కాపీరైట్, ట్రేడ్ మార్క్, డిజైన్లు ప్రభావం రోజువారీ జీవితంలో ఎలా ఉందనేది అవగాహన పెంచేందుకు గాను ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ఈ రోజు జరుపుతుంది. 1970లో మొదటిసారిగా ఈరోజును జరిపారు.

గణపతి స్థపతి పుట్టినరోజు

ప్రముఖ స్థపతి, వాస్తు శిల్పి గణపతి స్థపతి 1931 తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఎలువం కోటైలో జన్మించారు. శ్రీశైలం దేవస్థానం పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో గణపతి స్థపతి పేరు తెచ్చుకున్నారు. హుస్సేన్ సాగర్ జిబ్రాల్టర్ రాక్ పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

సముద్రఖని పుట్టినరోజు

భారతదేశానికి చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకుడు సముద్రఖని 1973 తమిళనాడులోని ధాలవైపురంసో జన్మించారు. తమిళం, మలయాళం, తెలుగు సినిమాల్లో పలు చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2001లో పార్థాలే పరవశం సినిమా ద్వారా నటుడిగా, 2003లో ఉన్నైచరణదా ఇందెన్ సినిమా ద్వారా దర్శకుడిగా సినీ రంగంలో ప్రవేశించారు.

సర్వ్ మిత్ర సిక్రి పుట్టినరోజు

సుప్రీంకోర్టు 13వ ప్రధాన న్యాయమూర్తి సర్వ్ మిత్ర సిక్రి 1908 పంజాబ్ కబీర్వాలాలో జన్మించారు. 1971 నుంచి 1973 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 1930లో లాహోర్ హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

కాకాని చక్రపాణి పుట్టినరోజు

ప్రముఖ తెలుగు కథా రచయిత కాకాని చక్రపాణి 1942 గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో జన్మించారు. తెలుగులో మానవ జీవన సంఘర్షణలను, ఆక్రోశాలను, ఆత్మీయత, అనుబంధాలను తనదైన శైలిలో రూపుదిద్ధారు. ఎన్నో నవలలు, కథలు, పెద్ద సంఖ్యలో అనువాదాలు, వ్యాసాలు రాశారు.

కొమరవోలు శివప్రసాద్ పుట్టినరోజు

ఈలపాట వేయడంలో ప్రసిద్ధులు కొమరవోలు శివప్రసాద్ 1955 గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఈలపాట ద్వారా ఇప్పటివరకు దాదాపు 11 వేలకు పైగా సంగీత కచేరీలు చేశారు. భారత్ లోనే కాకుండా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, మారిషస్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్ వంటి దేశాల్లో తన ఈలపాటతో ప్రేక్షకులను మెప్పించారు.

శ్రీనివాస రామానుజన్ మరణం

భారతదేశ ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 1920 మద్రాసు ప్రెసిడెన్సీలోని మద్రాసులో జన్మించారు. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాస్ 1887 డిసెంబర్ 22న మద్రాసు ప్రెసిడెన్సీ ఈరోడ్ లో జన్మించారు. గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశారు. 2012 లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజు జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు.

మరిన్ని విశేషాలు

హైదరాబాద్ మెట్రో రైలు పనులు 2012 లో అధికారికంగా ప్రారంభమయ్యాయి.

కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడోవవారు శ్యామ శాస్త్రి 1762 తంజావూరు జిల్లాలోని తిరువారూరులో జన్మించారు.

కన్నడ, తెలుగు సినిమా సంగీత దర్శకుడు ఎం. రంగారావు 1932 ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు.

భారతీయ సంగీత రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి సురేష్ పీటర్స్ 1968 చెన్నైలో జన్మించారు. ఐదు భారతీయ భాషలలో సంగీత దర్శకుడిగా పనిచేశారు. గాయకుడిగా రాణించారు.

మొఘల్ వంశంలో 12వ చక్రవర్తి మొహమ్మద్ షా 1748 ఢిల్లీలో మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button