తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

AP Elections: డీబీటీ చెల్లింపులపై బాబు అండ్ కో కుట్రలు..ఎన్నికల కోడ్ పేరుతో ఈసీపై ఒత్తిడి ?

చంద్రబాబు అండ్ కో కుట్రలతో ఇప్పటికే పెన్షన్‌దారులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పింఛన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టించడంలో సక్సెస్‌ అయిన చంద్రబాబు.. కుట్రపూరిత రాజకీయాలతో వలంటీర్లను ప్రజలకు దూరం చేశారు. అయితే తాజాగా, చంద్రబాబు మరో కుట్రకు స్కెచ్ వేసింది. సంక్షేమ పథకాల్లో భాగంగా చివరి దశ డీబీటీ చెల్లింపులను అడ్డుకునేందుకు ఈసీపై ఒత్తిడి చేస్తోందని వైసీపీ భావిస్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యాదీవెన, లా నేస్తం నిధులకు బ్రేక్ పడింది. దీని కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ డీబీటీ చెల్లింపుల కోసం ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా చివరిదశ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఈసీని అనుమతి కోరింది. అయితే ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అనుమతి రాలేదు. ఒకవేళ అనుమతి లభిస్తే.. ఒక్క బటన్‌ నొక్కితే చాలు అకౌంట్లలోకి నగదు బదిలీ అవుతోంది.

ALSO READ: రాష్ట్రంలో జరిగేది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌: సీఎం జగన్

అడ్డుకుంటున్న టీడీపీ బృందం..

గడిచిన ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలకు కోడ్ అడ్డురాదని వైసీపీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు అండ్ కో నుంచి ఎన్నికల అధికారికి ఒత్తిళ్లు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ మార్చిలో ఎన్నికల కోడ్ రాకముందే డీబీటీ చెల్లింపులు 70 నుంచి 80శాతం వరకు పూర్తయ్యాయి. మిగతా చెల్లింపులు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిలిచిపోయాయి. ఈ చెల్లింపులు చేయనీయకుండా టీడీపీ అండ్ కో అడ్డుకట్ట వేస్తుందని, ఎన్నికల కోడ్ అంటూ ఈసీపై ఒత్తిడి చేయడంతో మిగిలిన లబ్ధిదారులకు చెల్లింపులు నిలిచిపోయాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఈ పథకాలన్ని గత ఐదేళ్లుగా అమల్లో ఉన్నాయని, అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 15రోజుల క్రితమే ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

ALSO READ: పాపం ఎవరిదీ.. బ్యాంకుల వద్ద క్యూలో వృద్ధుల నరకయాతన!

పెన్షన్ల తరహాలోనే..

బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు తర్వాత అనుమతి విషయంలో పరిస్థితులు మారాయంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే పథకాలు నిలిచిపోవడంతో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి వెంటనే అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ అనుమతి ఇవ్వకుండా పెన్షన్ల తరహాలోనే ఇతర పథకాలను కూడా టీడీపీ అడ్డుపడుతోందని ఆరోపిస్తోంది. ఇప్పటికే డ్వాక్రా చెల్లింపులనూ నిలిపివేయడంతో మహిళలకు అన్యాయం జరిగింది. అదే విధంగా విద్యా దీవెన పథకంలోని కొంతమంది విద్యార్థులకు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కళాశాలల్లో ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ఇనుపుట్ సబ్సిడీ, వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం చెల్లింపులను కూడా టీడీపీ అండ్ కో అడ్డుకోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button