తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

YS Jagan: విశాఖ ఏపీకి డెస్టినేషన్‌.. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే?

వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 21వ రోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ప్రభంజనంలా కొనసాగుతోంది. దారిపొడవునా సీఎం జగన్‌కు ప్రజలకు బ్రహరథం పడుతున్నారు. మంగళవారం ఆనందపురంలో దాదాపు 2 వేల మందితో వైసీపీ సోషల్‌ మీడియా ప్రతినిధులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. విశాఖపట్నం ఏపీకి డెస్టినీ అవుతుందని, ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుందని జగన్ వెల్లడించారు. అంతకుముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో తమది రాజీ లేని ధోరణి అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ALSO READ: ఎన్ని కూటములు జత కట్టినా కష్టమే.. ఎన్నికల వేళ లావాదేవీలతో స్పష్టం చేసిన బాలకృష్ణ!

సోషల్ మీడియా బలంతోనే నిలబడ్డా..

సోషల్ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని జగన్ అన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా తట్టుకుని జగన్ నిలబడుతున్నారంటే సోషల్ మీడియా బలమేనని వెల్లడించారు. జగన్ కోసం ప్రాణమివ్వడానికి కొన్ని లక్షల గుండెలున్నాయన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. నేను ఒక్కడిని ఒకవైపు.. అబద్ధాలు, మోసాలు చేసే వారు మరోవైపు ఉన్నారన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో ఒకే ఒక్కడిగా దిగుతున్నానని, విజయానికి దగ్గరగా ఉన్నందునే మనపై దాడి చేస్తున్నారన్నారు. అదే విధంగా ప్రభుత్వం పథకాలతో లబ్ధి పొందిన గీతాంజలిని దారుణంగా ట్రోల్‌ చేసి వేధించారన్నారు. టీడీపీ అండ్ కో ఎంత దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్యే ఉదాహరణ అని వెల్లడించారు.

ALSO READ: 21వ రోజుకు చేరుకున్న ‘బస్సు యాత్ర’.. ప్రచారవ్యూహాలపై దిశానిర్ధేశం

దేవుడు ఏదో పెద్ద స్క్రిప్ట్‌ రాశాడు..

సోషల్‌ మీడియా మనతోనే ఉందని, సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ మనతోనే ఉంటారన్నారు. దాడులకు భయపడేది లేదన్నారు. దాడి జరిగిన కంటికి తాకలేదని, అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టేదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడని అర్థం. అందుకే దాడి నుంచి బయటపడ్డానని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో 175కి 175 రావాలని, 25కి 25 లోక్‌సభ సీట్లు గెలుస్తామని సోషల్‌ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్‌ అన్నారు. వైసీపీ సోషల్‌ మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే నేరుగా తెలిసేలా వేదిక ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అనంతరం పలువురు వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు తమ మనోగతాన్ని సీఎం జగన్‌తో పంచుకున్నారు. కాగా, ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర మోదవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది.

3 Comments

  1. Bwer Pipes: Empowering Iraqi Farmers with Reliable Irrigation Solutions: Join the countless farmers across Iraq who trust Bwer Pipes for their irrigation needs. Our state-of-the-art sprinkler systems and durable pipes ensure efficient water distribution, helping you achieve maximum crop yields while conserving water resources. Visit Bwer Pipes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button