తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

Memantha Siddham Bus Yatra: 21వ రోజుకు చేరుకున్న ‘బస్సు యాత్ర’.. ప్రచారవ్యూహాలపై దిశానిర్ధేశం

వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది. ఇవాళ విశాఖ జిల్లా ఎంవీవీ సిటీ నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరారు. ఈ మేరకు మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్‌ కన్వెన్షన్‌ హాల్‌ వద్ద సోషల్‌ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రాముఖ్యత, ప్రచారవ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. అక్కడినుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకొని అక్కడే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస చేయనున్నారు.

ALSO READ: ఎన్ని కూటములు జత కట్టినా కష్టమే.. ఎన్నికల వేళ లావాదేవీలతో స్పష్టం చేసిన బాలకృష్ణ!

భీమిలి వేదికగా..

రాజకీయాల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‎ఫ్లుయెన్సర్స్ హవానే ఎక్కువగా నడుస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త పుంతలు తొక్కుతూ సమాచారం వివిధ రూపాల్లో ప్రజలను చేరవేస్తున్నారు. వీరు షేర్ చేసే ప్రతి కంటెంట్, ప్రతి వీడియో చర్చనీయాంశంగా మారుతుంది. ఈ విధంగా అన్ని వర్గాలను సోషల్ మీడియా ఇన్‎ఫ్లుయెన్సర్స్ ప్రభావితం చేయడంతో రాజకీయాల్లో వీరి ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే ‘ మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్న వైసీపీ.. తాజాగా ఇన్‎ఫ్లుయెన్సర్స్‌తో ప్రచారానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీన భీమిలిలో( ఇన్‎ఫ్లుయెన్సర్స్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది.

ALSO READ: వైసీపీ మేనిఫెస్టోపై కూటమికి భయం.. కాసేపట్లో ఫైనల్ చేయనున్న సీఎం జగన్

అందరిలోనూ ఉత్కంఠ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. ఇవాళ విజయనగరం జిల్లాలో కొనసాగనుంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతి తక్కువ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి, వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే ప్రక్రియపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ చెల్లూరు వద్ద నిర్వహించే బహిరంగ సభలో సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో వంటి విషయాలపై ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button