తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Nara Rohit: జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం:’ప్రతినిధి-2′ టీజర్

ప్రముఖ టీవీ జర్నలిస్టు మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ ప్రధానపాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ప్రతినిధి-2. తాజాగా ఈ చిత్రం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి నేడు లాంచ్ చేశారు. దర్శకుడు మూర్తి, హీరో నారా రోహిత్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతినిధి-2 చిత్ర విశేషాలను మూర్తి, నారా రోహిత్… చిరంజీవికి వివరించారు. అనంతరం ఆయన లాప్ టాప్ ద్వారా టీజర్ ను ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read: టిల్లు స్క్వేర్ ఓటిటి పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ సినిమాలో నారా రోహిత్ ఓ జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక టీజర్‌లో మన దేశంలో ఎన్నికలు జరిగే విధానం, ఓట్లు కొనుక్కోవడం, అవినీతి గురించి గట్టిగానే డైలాగులు పడ్డాయి. “పైన కూర్చొని ఎన్ని అయినా చెబుతారు నీతులు.. మేము ఖర్చు పెట్టింది ఎవడిస్తాడు.. వాడా, వాడమ్మా మొగుడా” అంటూ పవర్‌ఫుల్‌గా డైలాగులు వినిపించాయి. ఇక ఒక మినిస్టర్‌ను ఇంటర్వ్యూ చేస్తూ మన రాష్ట్ర అప్పు ఎంత ఉంటుంది సార్ అని రోహిత్ అడిగారు. దీనికి సుమారు 5 లక్షల కోట్లు ఉండొచ్చు అంటూ ఆ మంత్రి సమాధానమిస్తే మరి అది తీర్చాలంటే ఎంత టైమ్ పడుతుంది సార్ అంటూ నారా రోహిత్ ప్రశ్నిస్తారు. అభివృద్ధి ఉంటే అది ఎంత సేపు అబ్బా అని మంత్రి సమాధానమిస్తే అదెక్కడుంది సార్ అంటూ కౌంటర్ ఇచ్చారు రోహిత్.

Also Read: వారికి పెళ్లి కాలేదట.. క్లారిటీ ఇచ్చిన అదితి

టీజర్ చూస్తే పక్కా పొలిటికల్ చిత్రమని అర్థమవుతోంది. వానర ఎంటర్టయిన్ మెంట్స్, రాణా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ప్రతినిధి-2 చిత్రానికి కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.

2 Comments

  1. Do you mind if I quote a few of your posts as long as I provide
    credit and sources back to your website? My blog site is in the
    very same area of interest as yours and my users would genuinely benefit from some of the information you present here.
    Please let me know if this okay with you. Many thanks!

    Also visit my webpage – vpn special code

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button