తెలుగు
te తెలుగు en English
జాతీయం

Bill Gates: ప్రధానితో మోడీతో బిల్‌గేట్ భేటీ.. AI గురించి ముచ్చట్లు

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని మోడీ ఇంట్లో శుక్రవారం భేటీ అయ్యారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణంలో మార్పులు, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్టక్చర్ వంటి వాటి గురించి ఇరువురు చర్చించారు. డిజిటల్‌ రంగంలో భారత్‌ తీసుకొచ్చిన మార్పులను బిల్‌గేట్స్‌ మెచ్చకున్నారు. భారతీయులు టెక్నాలజీని వేగంగా నేర్చుకున్నారని అన్నారు. సాంకేతికరంగంలో భారత్ వేగంగా దూసుకెళ్తుదంని బిల్ గేట్స్ అన్నారు.

Also read: KCR: బీఆర్ఎస్ కు నేతల ఝలక్.. వరంగల్ బరిలో బాబుమోహన్?

ప్రధాని మోడీతో ఆయన ఓ సెల్ఫీ తీసుకున్నారు. G-20 సదస్సులో AI టెక్నాలజీని వాడుకున్నామని చెప్పిన ప్రధాని నమో యాప్‌ను ఎలా ఉపయోగించాలనేది వివరించారు. చాట్‌ జీపీటీ వినియోగం మంచిదే కానీ, అది సోమరితనానికి దారి తీస్తోందని సూచించారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రారంభమై 25 ఏళ్లు గడిచిందని బిల్‌గేట్ తెలిపారు.

ఇక డేటా వినియోగం గురించి మోడీ మాట్లాడుతూ.. ప్రైవసీని దెబ్బతీయకుండా డేటా వినియోగం జరగాలన్నారు. రీసెర్చ్‌ డేటా వాడుకునే సమయంలో.. డేటా యజమానికి ఈ విషయం తెలియాలని అన్నారు. భారత్‌లో టెక్నాలజీ వినియోగం తీరుతెన్నులను ప్రధాని బిల్‌గేట్స్‌కు వివరించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిమించడానికి టెక్నాలజీని వాడాలని అనుకుంటున్నామని మోడీ ఆయనతో అన్నారు.

ఇక వీరిద్దరి మధ్య పర్యావరణ పరిరక్షణపై చర్చ జరిగింది. సన్‌రైజ్‌ సెక్టార్ల కోసం రూ.లక్ష కోట్ల కార్పస్‌ ఫండ్‌ను విడుదల చేసినట్లు ప్రధాని తెలిపారు. జీవనశైలిలో మార్పుల కోసం మిషన్‌ లైఫ్‌ తీసుకొచ్చామన్నారు. విద్యుత్‌, ఉక్కు వినియోగం పర్యావరణ విరుద్ధం అన్న ప్రధాని గ్రీన్‌ జీడీపీ వృద్ధి చేసుకోవడంలో దృష్టిపెడుతున్నామని గేట్స్ తో చెప్పారు. సిరిధాన్యాల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం మిల్లెట్స్‌ ఉత్పత్తిపై పెద్ద కంపెనీలు దృష్టిపెట్టాయన్నారు. ఇక సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ గురించి కూడా బిల్‌గేట్స్‌కు మోడీ వివరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button