తెలుగు
te తెలుగు en English
జాతీయం

Hemangi Sakhi: ప్ర‌ధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండ‌ర్.. ఎవ‌రీ హేమాంగి స‌ఖి మాత!

ప్ర‌ధాని నరేంద్ర‌ మోదీ వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న‌పై ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కూడా పోటీ చేస్తుండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అఖిల భార‌త హిందూ మ‌హాస‌భ (ఏబీహెచ్ఎం) కు చెందిన హేమాంగి స‌ఖి మాత బ‌రిలో నిలిచారు. గుజ‌రాత్ రాష్ట్రం బ‌రోడాలో జ‌న్మించిన ఆమె ప్ర‌పంచంలోనే భ‌గ‌వ‌ద్గీత‌ను బోధిస్తున్న మొట్ట‌మొద‌టి ట్రాన్స్‌జెండ‌ర్.

Also Read: వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ కూటమి నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

ఉత్తరప్రదేశ్ లో 20 లోక్ సభ స్థానాలకు పోటీ చేయబోతున్న అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్‌ఎం) మోదీపై హేమాంగి సఖి మాను పోటీగా నిలబెట్టింది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో జూన్ 1న తేదీన పోలింగ్ జరగనుంది. కాగా, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా యూపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ మరోసారి పోటీకి చేయనున్నారు.

Also Read: ఎన్నికల కోడ్ అమల్లోకి … భారీగా నగదు స్వాధీనం

2019లో ఆమె ఆచార్య మ‌హామండ‌లేశ్వ‌ర్‌గా ప‌ట్టాభిషిక్తుల‌య్యారు. కాగా, ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్ కావ‌డంతో వారి కుటుంబం ముంబైకి మారిపోయింది. కాగా, గొప్ప ఆధ్యాత్మికపరురాలిగా ఉన్న‌ ఆమె పోటీతో హిందూత్వ నినాదాన్నే ఊపిరిగా చేసుకుని ముందుకు సాగుతున్న బీజేపీకి ఎంతవరకూ ఇబ్బంది అవుతుంది అన్న చర్చ సాగుతోంది.

Also Read: CM రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఇక ఇప్పటివ‌ర‌కు రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఇటు ఆప్ కానీ అటు ఎస్‌పీ కానీ సెక్యూలర్ భావజాలంతో ముందుకు సాగిన వారు. దాంతో హిందూత్వ అన్న నినాదం ఏకమొత్తంగా బీజేపీ పరం అయ్యేది. ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్ధిని పెట్టడం, అందులోనూ హేమాంగి సఖి మాత వంటి వారు పోటీకి ముందుకు రావడంతో అంద‌రూ ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు.

4 Comments

  1. I was wondering if you ever considered changing the layout
    of your blog? Its very well written; I love what youve got to say.
    But maybe you could a little more in the way of content so people could
    connect with it better. Youve got an awful lot
    of text for only having one or 2 images. Maybe you could space it out better?

    My blog post – vpn special

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button