తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth Convoy: CM రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో పంక్చర్ అయి ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు లాండ్ క్రూజర్‌కు మరమ్మతులు చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ఘటన జరిగింది.

Also Read: వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ కూటమి నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

అనంతరం టైరు పేలిన కారును అక్కడే వదిలి మిగిలిన వాహనాలతో రేవంత్ కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి చేరుకున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. మండలాలవారీగా కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు వివిధ మండలాల సమన్వయ కమిటీ నాయకులు హాజరయ్యారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కూడా సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.

2 Comments

  1. Thank you for your openness to explore various topics! If you have any specific questions or areas of interest you’d like to discuss, feel free to share them. Whether it’s about the latest advancements in technology, recent scientific breakthroughs, thought-provoking literature, or any other subject, I’m here to offer insights and assistance. Just let me know how I can be of help, and I’ll do my best to provide valuable information and engage in meaningful discussions!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button