తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Harish Rao: సీఎంవా లేక చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా?: హరీశ్ ఫైర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించడమేంటని మండిపడ్డారు. ‘నువ్వు ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను చూసి చలించిపోయారని హరీష్ రావు చెప్పారు.

Also Read: గంటావారిపాలెం నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం

వడ్లకు రూ.500 లు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ వెంటనే అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర పదజాలంతో కేసీఆర్ పై విరుచుకుపడ్డారని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ చెడ్డీ ఊడగొడతానని రేవంత్ రెడ్డి అనడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, పదేళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్ పై ఇలాంటి భాష ఉపయోగిస్తావా అంటూ రేవంత్ పై హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button