తెలుగు
te తెలుగు en English
హాలీవుడ్

Joker: హాలీవుడ్ మూవీ ‘జోక‌ర్’ టీజ‌ర్ రిలీజ్

హాలీవుడ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ జోక‌ర్ సినిమాకు సీక్వెల్ రానుంది. ‘జోకర్‌: ఫోలీ ఏ డీక్స్‌’ అంటూ ఈ సినిమా రానుండ‌గా.. టాడ్‌ ఫిలిప్స్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ ప‌నుల్లో బిజీగా ఉంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా.. జోక్విన్ ఫీనిక్స్‌తో పాటు పాప్‌స్టార్‌ లేడీగాగా క‌నిపించి అల‌రించారు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

Also Read: ఓటీటీ లవర్స్‌కి గుడ్ న్యూస్… ఒకే రోజు మూడు సినిమాలు!

జైల్‌లో ఉన్న జోక‌ర్‌కి లేడిగాగా ప‌రిచ‌యం అవుతుంది. వీళ్ల ప‌రిచ‌యం ప్రేమ‌గా ఎలా మారింది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అనే స్టోరీతో ఈ సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రం అక్టోబరు 4, 2024న థియేటర్లలోకి రానుంది. డీసీ కామిక్స్‌లో భాగంగా 2021లో వ‌చ్చిన జోక‌ర్ బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఇక ఈ సినిమాలో న‌ట‌న‌కు గాను జోక్విన్ ఫీనిక్స్ ఉత్త‌మ న‌టుడిగా అకాడమీ అవార్డు కూడా అందుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button