తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: చంద్రబాబును నమ్మారు.. దారుణంగా మోసపోయారు!

నమ్మించి మోసం చేయడం, తడిగుడ్డతో గొంతు కోయడం, అవసరం తీరాక ఆమడ దూరంలోకి నెట్టడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. ఈ విద్యలో ఆయన ఎంతగా ఆరి తేరిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్‌సీవీ నాయుడు, చాంద్ భాషా, జంగా కృష్ణమూర్తి, ఉండవల్లి శ్రీదేవి వంటి వారంతా చంద్రబాబు మోసపు కాటుకు బలైనవారే. వీరినందరినీ చంద్రబాబు నమ్మించి ఎలా గొంతుకోశారో తెలిస్తే ఎవరైనా షాక్‌కు గురికాక తప్పదు. వీరి పరిస్థితి చూశాక, టీడీపీలో చేరాలంటనే ఏ నాయకుడైనా గజగజ వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న, రాజ్యసభ పదవి ఆఫర్ చేసినా, నామినేటెడ్ పదవులు ఇస్తామన్నా ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.

ALSO READ: ఎన్నికల వేళ సంచలన సర్వే.. అధికారం ఎవరిదంటే?

ఎస్‌సీవీ నాయుడు, చాంద్ భాషలకు భారీ దెబ్బ..

వైసీసీ నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశించి భంగపడ్డ ఎస్‌సీవీ నాయుడు.. టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేరిక సందర్భంలో శ్రీకాళహస్తి టిక్కెట్ తనకే కేటాయిస్తానని చెప్పిన చంద్రబాబు మాట మార్చారు. ఆ టిక్కెట్‌ను బొజ్జల సుధీర్ రెడ్డికి కేటాయించి ఎస్‌సీవీని దారుణంగా మోసం చేశారు. ఇక, చాంద్ భాషా పరిస్థితి అయితే దయనీయం. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కదిరి ఎమ్మెల్యేగా చాంద్ భాషా గెలుపొందారు. అయితే ఆ తర్వాత పార్టీ మారిన చాంద్ భాషా.. అప్పట్లో అధికార పార్టీ అయిన టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికల్లో చాంద్ భాషా టీడీపీ టికెట్ ఆశించగా.. చంద్రబాబు మాత్రం కందికుంటకు కేటాయించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుఫున సిద్ధారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో అయినా ఛాన్స్ వస్తుందని అనుకుంటే చంద్రబాబు ఆయన్ను మరోసారి మోసం చేసి కందికుంట వైపే మొగ్గుచూపటంతో ఇటీవలే ఆయన వైసీపీలో చేరారు.

ALSO READ: గంటావారిపాలెం నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం

జంగా కృష్ణమూర్తి, శ్రీదేవి పరిస్థితి అంతే..

మరోవైపు, వైసీపీ నుంచి గురజాల టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని సైతం చంద్రబాబు సుతిమెత్తంగా మోసం చేశారు. టీడీపీలో చేరితే గురజాల టిక్కెట్ తనకే కేటాయిస్తానని చెప్పి, తీరా కృష్ణమూర్తి పార్టీలో చేరిన తర్వాత మాట మార్చారు. ఆ స్థానాన్ని వేరొకరికి కేటాయించడంతో కృష్ణమూర్తి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఇక ఉండవల్లి శ్రీదేవిని చంద్రబాబు ఎంత దారుణంగా మోసం చేశారో సోషల్ మీడియాలో సైతం వైరలైన విషయం తెలిసిందే. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా సీఎం జగన్మోహన్ రెడ్డి.. శ్రీదేవికి తాడికొండ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. కానీ ఆమె.. జగన్ పట్ల ఏమాత్రం విశ్వాసం లేకుండా ప్రవర్తించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకే నమ్మకం ద్రోహం చేసి టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. ఆ తర్వాత కొంత కాలానికే టీడీపీలో చేరారు. చంద్రబాబు కోసమే శ్రీదేవి ఇంత చేసినా చివరకు ఆమెను చంద్రబాబు మోసం చేశారు. తాడికొండ టిక్కెట్‌ను వేరే అభ్యర్థికి కేటాయించారు. దీంతో సోషల్ మీడియాలో పోస్టు ద్వారా శ్రీదేవి… చంద్రబాబు తనను ఎలా మోసం చేశారో చెప్పి, తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button