తెలుగు
te తెలుగు en English
హాలీవుడ్

BAFTA Awards: బాఫ్టా అవార్డ్స్‌.. ఆ సినిమాకు ఏడు అవార్డులు

హాలీవుడ్ మూవీ ‘ఓపెన్‌హైమర్‌’ ఇటీివల విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు కొట్టింది ఈ మేరకు ఆదివారం రాత్రి లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్ వేదిక‌గా జరిగిన బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుని 2024 ఏడాదికి సంబంధించి అగ్రగామిగా నిలిచింది.

ALSO READ: గూస్ బంప్స్ తెప్పిస్తున్న సాంగ్‌… మొదటి 𝐀𝐈 జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే!

ఆస్కార్‌ రేసులో..

ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా ఏడు అవార్డులను గెలుచుకుంది. అయితే నోలన్‌కు దర్శకుడిగా ఇదే తొలి బాఫ్టా అవార్డు కావడం విషేశం. కాగా, ఇప్పటికే అత్యధిక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు గెలుచుకున్న ‘ఓపెన్‌హైమర్‌’ వచ్చే నెలలో జరిగే ఆస్కార్‌ రేసులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

ALSO READ: ఓటిటిలోకి సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాఫ్టా అవార్డు విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం : ఓపెన్‌హైమర్‌

ఉత్తమ దర్శకుడు : క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ నటుడు : సిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ నటి : ఎమ్మా స్టోన్‌ (పూర్‌ థింగ్స్‌)

ఉత్తమ సహాయ నటుడు : రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ సహాయ నటి : డావిన్‌ జాయ్‌ రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)

ఉత్తమ కాస్ట్యూమ్ : హోలీ వాడింగ్టన్ (పూర్ థింగ్స్)

ఉత్తమ బ్రిటిష్ చిత్రం : జోనాథన్ గ్లేజర్, జేమ్స్ విల్సన్ (క్రాబ్ డే)

ఉత్తమ సినిమాటోగ్రఫీ : హోట్‌ వాన్‌ హోటిమా (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ ఎడిటింగ్ : జెన్నిఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : జస్టిన్ ట్రిట్, ఆర్థర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ )

ఉత్తమ విజువల్స్ : సైమన్ హ్యూస్ (పూర్ థింగ్స్ )

ఉత్తమ డాక్యుమెంటరీ: 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button