తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఈసారి ఛాన్స్ ఎవరికంటే?

లోక్‌సభ ఎన్నికలు సమీస్తున్న వేళ.. మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేకంటే ముందుగానే రాష్ట్ర మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకునేందుకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆరుగురితో కూడిన లిస్ట్ తీసుకొని, రేవంత్ రెడ్డి త్వరలోనే ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో భేటీ కానున్నట్లు సమాచారం.

కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తోంది. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖలు మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి వర్గంలోకి మరో ఆరుగురి తీసుకునే అవకాశం ఉన్నా అధిష్టానం అప్పుడు ముందుకెళ్లలేదు. అన్ని వర్గాల వారిని, సీనియర్లు, జూనియర్లను కలుపుకొని మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం.

ALSO READ: నేడు బీజేపీ ఎన్నికల శంఖారావం.. ప్రచార రథాలను ప్రారంభించనున్న కిషన్ రెడ్డి

ఈసారి ఛాన్స్ ఎవరికంటే?

ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిథ్యం లేదు. దీంతో ఆ జిల్లాల వారికి ఈసారి ఛాన్స్ దక్కనుంది. నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి రేసులో ఉండగా, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పేరు వినిపిస్తోంది. వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ (ఎమ్మెల్సీ కోటా)లో మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. మరి వీరిలో సీఎం రేవంత్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button