తెలుగు
te తెలుగు en English
జాతీయం

Kamal Haasan: రెండు రోజుల్లో గుడ్‌న్యూస్‌ చెప్తా.. ఎన్నికల వేళ స్టార్ హీరో కామెంట్

లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి తెరలేపాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ ప్రముఖులు సైతం వెనకాడడం లేదు. ఇటీవల తమిళ హీరో విజయ్ కొత్తపార్టీని ప్రకటించారు. కానీ పోటీ చేయడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎన్నికలపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌ హాసన్‌ అప్డేట్ ప్రకటించారు. రెండు రోజుల్లో గుడ్‌న్యూస్‌ చెబుతానని పేర్కొన్నారు.

ALSO READ:  నేడు బీజేపీ ఎన్నికల శంఖారావం.. ప్రచార రథాలను ప్రారంభించనున్న కిషన్ రెడ్డి

రెండు రోజుల్లో నిర్ణయం ..

లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో కమల్‌ పార్టీతో అధికార డీఎంకే పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కలమ్‌ హాసన్‌ స్పందించారు. సోమవారం ఉదయం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మాట్లాడారు. పొత్తుపై రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని చెప్పారు. ‘ఎంపీ ఎన్నికలపై కసతర్తు చేస్తున్నామని, అందరికీ అవకాశం వస్తుందని, పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తాం’ అని కమల్‌ హాసన్‌ తెలిపారు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button