తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

RGV: వాళ్లు ఆ సినిమాలను బాత్రూమ్‌లలో చూస్తారు… ఆర్జీవీ సెన్షేషనల్ కామెంట్స్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’, ‘శపథం’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. బాక్సింగ్ రింగ్ లోకి దిగిన వాళ్లు అవతలివాడిని గట్టిగా గుద్దాలని… నీ వెంట్రుకలు పీకుతా, బుగ్గ గిల్లుతా అని అంటే కుదరదని చెప్పారు. తన రెండు చిత్రాల్లో వాస్తవాలను గుడ్డలు విప్పి, నగ్నంగా చూపించానన్నారు.

Also Read: మహేశ్ బాబు అన్న కూతురు డ్యాన్స్… ఎనర్జీ మామూలుగా లేదుగా!

టీడీపీ, జనసేన వాళ్లు ఈ చిత్రాలను చూస్తారా అని కొందరు అడుగుతున్నారని… తాను పోర్న్ చూసే విధంగా… ఈ సినిమాను వాళ్లు బాత్రూమ్ లలో చూస్తారని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉండేవాళ్లు పబ్లిక్ గా అందరితో పాటు లివింగ్ రూమ్ లో చూడొచ్చని తెలిపారు. ‘వ్యూహం’ ఈ నెల 23న, ‘శపథం’ మార్చి 1న విడుదల అవుతున్నాయని చెప్పారు. ఈ సినిమాలను ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి అని అన్నారు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button