తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Kalki: కల్కి రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ వేయిటింగ్.. మళ్లీ వాయిదా పడనుందా?

ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 ఏడీ. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ సంస్థ దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్స్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఈ కల్కి సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

Also read: Swayambhu: నభా నటేష్ కు సూపర్ ఆఫర్.. స్వయంభూ మూవీలో ఛాన్స్

ఈక్రమంలోనే తాజాగా కల్కి సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ న్యూస్ విని ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆనందపడేలోపే.. మళ్ళీ పోస్ట్ పోన్ కానుంది అనే విషయం తెలిసి డిజప్పాయింట్ అవుతున్నారు. కారణం.. మే నెలలో దేశవ్యాప్తంగా ఎన్నికల హంగామా మొదలుకానుంది. కాబట్టి.. అన్ని రాష్ట్రాల్లో ఈ సందడి కొనసాగనుంది. ఈ కారణంగానే కల్కి సినిమా మరోసారి పోస్ట్ పోన్ చేయనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందించే విషయం కూడా ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ సినిమా కేవలం 20 రోజులు మాత్రమే వాయిదా పడనుంది. అంటే మే 29 న ఈ సినిమాను విడుదల చేయనున్నారట మేకర్స్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button