తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Siddhu Jonnalagadda: కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న ‘టిల్లు స్క్వైర్’… 100 కోట్ల దిశగా పరుగులు

ఇప్పటివరకు ఇండస్ట్రీలో విడుదలైన సిక్వెల్స్ అన్ని ఒక ఎత్తు.. సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సిక్వెల్ టిల్లు స్క్వేర్ ఒక ఎత్తు అనేలా.. టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఉండడంతో.. సినిమా రిలీజ్ అయ్యి ఆరు రోజులు అయినా కూడా ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో .. బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టిస్తోంది.

Also Read: నభా నటేష్ కు సూపర్ ఆఫర్.. స్వయంభూ మూవీలో ఛాన్స్

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా కొంతకాలం ముందు వచ్చిన ‘డీజే టిల్లు’ యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ‘టిల్లు స్క్వైర్’ మార్చి 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై నిన్నటితో 6 రోజులైంది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమా 91 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

Also Read: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.. రేపే రిలీజ్

ఈ లెక్కన చూసుకుంటే టిల్లు స్క్వైర్ 100 కోట్ల క్లబ్ చేరడానికి ఎక్కువ రోజులు పట్టేలా కనిపించడంలేదు. రాబోయే రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక సినిమా విడుదల తర్వాత జరిగిన సక్సెస్ మీట్ లో…. ‘టిల్లు 3’ కూడా ఉంటుందనీ, ఈ సారి హీరో ఇంకా పెద్ద సమస్యలో చిక్కుకుంటాడని సిద్ధూ చెప్పడం అందరిలో ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఇస్తామని మేకర్స్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button