తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం చేస్తా.. సీఎం జగన్

కొంచెం ఓపిక పట్టండి.. జూన్ 4న మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపైనే చేసి ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తామని వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రకటించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు కాదని, పేద సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. మీ అమూల్యమైన ఓటు మన తలరాతను, మన భవిష్యత్తును మనమే రాసుకునేందుకని గుర్తు ఉంచుకోవాలని మరోసారి గుర్తు చేశారు.

రాజకీయాలు దిగజారిపోయాయి..

ప్రస్తుతం రాజకీయాలు దిగజారిపోయాయని, ఎంతలా అంటే అవ్వాతాతలకు ఇంటి వద్ద ఇచ్చే పెన్సన్లను కూడా ఆపే స్థాయికి చెడిపోయాయని అన్నారు. చంద్రబాబు కుట్రతో పెన్షన్ తీసుకునేందుకు వెళ్లి 31 మంది అవ్వా, తాతలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంతలో చంద్రబాబును హంతకుడు అనలేమా అని ఆరోపించారు. వలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు ఓటమి భయం నెలకొందని, అందుకే వారిపై కక్ష్య పెంచుకొని ఒకటో తేదీన పెన్షన్లు ఇంటి వద్దకే అందించే వలంటీర్లను అడ్డుకుంటున్నారని వెల్లడించారు. పేదల భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్‌ మరోసారి ప్రశ్నించారు.

చంద్రబాబుపై చురకలు

చంద్రబాబుకి గుర్తొచ్చేది వెన్నుపోటు అంటూ సింబాలిక్‌గా సైగతో సీఎం జగన్‌ చూపించారు. ఈయన 14 ఏళ్లు, మూడుసార్లు సీఎం అని చెబుతావ్‌ కదా.. మరి నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచిగానీ, సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా? అంటూ ప్రశ్నించారు. అలాగే పొదుపు సంఘాల పూర్తి రుణమాఫీ అన్నాడు? చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25వేలు డిపాజిట్‌ చేస్తా అన్నాడు.. చేశాడా? ఇంటింటికి నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా? రైతులకు రుణమాఫీ అన్నాడు? చేశాడా? మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు.. కనీసం సెంటు స్థలం అయినా ఇచ్చాడా? అంటూ చురకలు అంటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button