తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: నెల్లూరులో ముఖ్యనేతలతో భేటీ.. నేడు బస్సు యాత్రకు విరామం!

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రాయలసీమ జిల్లాలో ముగిసింది. మార్చి 27న తేదీన ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర ఎనిమిదవ రోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సూళ్లూరు­పేట, గూడూరు నియోజకవ­ర్గాల పరిధిలో విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం రాత్రి ఈ యాత్ర నెల్లూరులోకి అడుగుపెట్టింది. కాగా, ఇవాళ బస్సు యాత్రకు విరామం ప్రకటించారు.

ALSO READ: మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం చేస్తా.. సీఎం జగన్

నాయకులకు దిశానిర్ధేశం..

నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డి పాలెం విడిది కేంద్రంలో శనివారం మధ్యాహ్నం వరకు సీఎం జగన్ ఉండనున్నారు. నెల్లూరులోనే సుమారు 36 గంటలకుపైగా సీఎం జగన్ మకాం వేయడంతో సరికొత్త వ్యూహరచనకు పదును పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలతోపాటు రెండు లోక్ సభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది. అయితే తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా నాయకులకు దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం.

ALSO READ: టిప్పర్‌ డ్రైవర్‌ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా!

సుదీర్ఘ విరామం తర్వాత..

రాయలసీమ జిల్లాలో బస్సు యాత్రను పూర్తి చేసుకొని గురువారం రాత్రి 10 గంటలకు నెల్లూరులోని చింతారెడ్డిపాలెంకు చేరుకుంది. నెల్లూరు నగరానికి సమీపంలోని జాతీయ రహదారి వద్ద జగన్ బస చేశారు. ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా సీఎం జగన్ నెల్లూరులో బస చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆయన నెల్లూరులోనే బస చేయనున్నారు. కాగా, వైఎస్ జగన్ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలకు క్యాంప్ సైట్ వద్దకు రావాలని పిలుపు వెళ్లినట్లు సమాచారం.ఈ సమావేశంలో సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button