తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Swayambhu: నభా నటేష్ కు సూపర్ ఆఫర్.. స్వయంభూ మూవీలో ఛాన్స్

కన్నడ బ్యూటీ నభా నటేష్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఆమధ్య జరిగిన యాక్సిడెంట్ వల్ల చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రెస్టీజియస్ సినిమాలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించి ఆడియన్స్ కు షాకిచ్చింది.

Also read: Pushpa2: పుష్ప2 నుంచి కీలక అప్డేట్.. టీజర్ వచ్చేస్తోంది

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా దర్శకుడు భరత్ కృష్ణమాచారి స్వయంభూ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్బంగా స్వయంభూ సినిమా నుండి నభా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ట్రెడిషనల్ గా ఉన్న ఆమె లుక్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచుతోంది. మరి చాలా గ్యాప్ తరువాత హిస్టారికల్ మూవీతో వస్తున్న నాభా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత కథనాలు

Back to top button