Pushpa2: రష్మిక బర్త్ డే గిఫ్ట్ రిలీజ్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మొదటి పార్ట్ కి వచ్చిన భారీ హైప్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
తాజాగా అలాంటి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. నేడు రష్మిక పుట్టినరోజు సందర్బంగా పుష్ప 2 నుండి శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒంటినిండా నగలతో, పట్టు చీర, కళ్ళకు కాటుకతో పవర్ ఫుల్ గా ఉన్న రష్మిక లుక్ అదిరిపోయింది. ఆడియన్స్ నుండి ఈ పోస్టర్ కు విశేషమైన స్పందన వస్తోంది. దీంతో ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై అంచనాలు కూడా అమాంతం పెరుగుతున్నాయి.
Also read: Swayambhu: నభా నటేష్ కు సూపర్ ఆఫర్.. స్వయంభూ మూవీలో ఛాన్స్
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. పుష్ప 2లో హైలైట్ గా నిలువనున్న జాతర సీక్వెన్స్ తో ఈ టీజర్ కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా పవర్ ఫుల్ గా ఉండటంతో టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ టీజర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే మరో మూడురోజులు ఆగాల్సిందే.
Ravonte Bucurestean
Lyza Ciconte
Scout Niebler
Gavan Smiroldo
Tishya Gosciniak
Lynnlea Greengard
Addlie Engelin
Benedikta Giampieri
Sharav Sendin