తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన… రేవంత్ పై మొగులయ్య పాట

కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ మొగులయ్య…. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. మొగులయ్యను, ఆయన చిన్న కుమారుడిని మంత్రి కొండా సురేఖ సీఎం నివాసానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ముందు మొగులయ్య తన కళను ప్రదర్శించారు. ‘పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన అచ్చంపేట తాలూకాలోన కొండారెడ్డిపల్లిలోన’ అంటూ పాట పాడారు. మొగులయ్య పాటకు మంత్ర ముగ్ధుడైన సీఎం రేవంత్ ఆయనను అభినందించారు. అనంతరం వ్యక్తిగత అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Also Read: టార్గెట్ మెదక్… కీలక నేతలతో సీఎం రేవంత్ సమావేశం

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అవుసలి కుంట గ్రామానికి చెందిన మొగులయ్య కిన్నెర వాయిద్యకారుడు. ప్రస్తుతం పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని ఆయన మాత్రమే వాయించగలరు. కిన్నెర వాయిద్యానికి విశేష గుర్తింపు తీసుకొచ్చిన మొగులయ్యను 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా సత్కరించి ఆర్థిక సాయం అందించింది.

3 Comments

  1. Hi there are using WordPress for your blog platform?
    I’m new to the blog world but I’m trying to get started and set up my
    own. Do you require any html coding expertise to make your own blog?
    Any help would be really appreciated!

    Feel free to visit my web page … vpn special code

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button