తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pushpa2: పుష్ప2 నుంచి కీలక అప్డేట్.. టీజర్ వచ్చేస్తోంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అప్డేట్ రాబోతోందని నిన్నటి నుంచి సోషల్ మీడియాకి హత్తుకుపోయారు. ఇక ఆ సమయం వచ్చేసింది.

Also read: Lambasingi: ఓటిటిలోకి వచ్చేసిన లంబసింగి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఏప్రిల్ 8న టీజర్ రాబోతున్నట్లు ప్రకటించారు. పుష్పరాజ్ రెట్టింపు అగ్నితో వస్తున్నాడు..కాసుకోండి. 2024 ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు. దీంతో పుష్ప ఫ్యాన్స్ మస్తు ఖుషీలో ఉన్నారు.

పుష్ప ఫస్ట్ పార్ట్ లో మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన అల్లు అర్జున్ కు.. ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్న అల్లు అర్జున్ కు తేడా తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా.. సుకుమార్ క్రియేటివ్ ఐడియాస్.. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అంచనాల దృష్ట్యా.. సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి తగ్గేదేలే అన్నట్టు నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఈ సీక్వెల్ మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక ఏదేమైనా రూ.1000 కోట్లకు టార్గెట్ తో బరిలో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button