తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Lambasingi: ఓటిటిలోకి వచ్చేసిన లంబసింగి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

భరత్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌, దివి జంటగా నవీన్ గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లంబసింగి’. బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో టి. ఆనంద్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Also read: Rashmi Gautham: అమెరికా అబ్బాయితో రష్మీ పెళ్లి.. హింట్ ఇచ్చిన జబర్ధస్త్ కమెడియన్?

నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆడియన్స్ ను కొంతమేరకు మెప్పించిన..పెద్ద సక్సెస్ అవ్వలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. లంబసింగి నేటి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు అవుతుంది. ఈమేరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ కూడా చేసింది. మరి థియేటర్లలో చూడని వారు ఇంట్లోనే కూర్చొని లవ్ స్టోరీని ఎంజాయ్ చేయండి.

ఒక స్వచ్ఛమైన ప్రేమకథను కళ్ళకు కట్టినట్లు సహజంగా చూపించారు డైరెక్టర్ నవీన్ గాంధీ. ఆర్.ఆర్.ధ్రువన్ అద్బుతమైన పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఇచ్చాడు. హృదయాన్ని కదిలించే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయిన లంబసింగి.. ఓటీటీ ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button