తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

AP Politics: పింఛన్లు ఇవ్వనీయకుండా అడ్డుకుంటావా?

టీడీపీ అధినేత చంద్రబాబుకు పేదవారంటే మొదటి నుంచీ చులకన భావమేనని, ప్రతీనెల ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకుంటావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహంతో పేదలపై, దళితులపై దాడులు చేయించాడని, ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని సమయానికి పింఛన్ రాకుండా వృద్ధులు, దివ్యాంగులను తిప్పలు పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో మళ్లీ క్యూలో నిల్చునే పరిస్థితి తీసుకొచ్చాడని వందలాది మంది పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు.

ALSO READ: బుర్రకాయలకోట క్రాస్ దాటిన జగన్ యాత్ర

కాళ్లరిగేలా తిరిగేవాళ్లం..

వృద్ధుల విషయంలో కనీస మానవత్వం లేకుండా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని, చంద్రబాబు పాలనలో అసలు పింఛన్‌ మంజూరవ్వడానికే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని వాపోయారు. పింఛన్‌ కోసం ఎండలో క్యూ లైన్లలో గంటల తరబడి పడిగాపులు పడేవాళ్లమంటూ గుర్తు చేసుకున్నారు. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి వద్దకే పింఛన్ అందించేలా వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని, దీంతో ఇబ్బందులు తొలిగాయని చెప్పుకొచ్చారు. కానీ ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను చంద్రబాబు అడ్డుకున్నాడని మండిపడ్డారు.

ALSO READ: దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం.. 6వ రోజు షెడ్యూల్ ఇదే!

ఇంటికే పెన్షన్‌..

వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రతీనెలా ఒకటో తేదీన అందించే పెన్షన్లపై ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తున్నామని పింఛన్ దారులు చెప్పుకొచ్చారు. వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని కోరుతున్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సి వచ్చేదని, కానీ జగన్ పాలనలో ప్రతి నెలా క్ర­మం తప్పకుండా వలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇ­స్తున్నారని, ఇంత చక్కని పాలన ఇంకెవ్వ­రూ అందిం­చలేరన్నారు. మళ్లీ జగన్‌ ప్రభుత్వమే కా­వాలంటూ నినాదాలు చేశారు.

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button