తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: బుర్రకాయలకోట క్రాస్ దాటిన జగన్ యాత్ర

మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. చీకటిమనిపల్లెలో ప్రారంభమైన ఈ యాత్ర.. ములకలచెరువు,పెదపాలెం, వేపురికోట మీదుగా బుర్రకాయలకోట క్రాస్‌ దాటింది. తర్వాత గొల్లపల్లి, అంగళ్లు వరకు కొనసాగనుంది. కాగా, దారిపొడవునా ఆత్మీయ స్వాగతం పలికేందుకు ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. ఇక సాయంత్రం మదనపల్లెలో జరిగే వైసీపీ ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె శివారులో రాత్రి బసకు చేరుకుంటారు.

ప్రచారంలో సరికొత్త మార్పు..

జననేతకు జనం హారతులు పడుతున్నారు. రాజకీయాలను సైతం పక్కనబెట్టి సీఎం జగన్ చూసేందుకు అభిమానులు, ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక, జగన్ కూడా ప్రసంగాలకు విరామం ఇచ్చి సామాన్యులతో మమేకమవుతున్నారు. ఇలా ప్రచారంలో సరికొత్త మార్పు తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రజలతో మాటామంతీ, వారితో సెల్ఫీలు, ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాగా, ప్రచారంలో రాజకీయాలను పక్కనబెట్టి, అడుగడుగునా సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. అదే విధంగా పలువురి నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ALSO READ: దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం.. 6వ రోజు షెడ్యూల్ ఇదే!

బాధప­డకమ్మా.. ఆదుకుంటా..

చదువులో రా­ణిస్తున్న తన కుమారుడు ఉన్నట్టుండి కంటిచూపు పోయిందని, చదువుపై ఆసక్తి తగ్గని కుమారుడు యూట్యూబ్‌లో పాఠాలు వింటూ పరీక్షలు రాస్తున్నాడని, మీరే తన కుమారుడికి కంటి చూపు వచ్చేందుకు తగిన సాయం చేసి ఆదుకోవాలని ఓ తల్లి వేడుకుంది. అర్జీ స్వీకరించిన సీఎం జగన్‌ స్పందిస్తూ.. బాధప­డకమ్మా.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. అదే విధంగా వలంటీర్ల సేవలను చంద్రబాబు అడ్డుకోవడంపై అవ్వాతాతల స్పందనని అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇంటికి పెన్షన్ రాకుండా అడ్డుకున్న చంద్రబాబుపై అవ్వతాతలు మండిపడుతున్నారు. అయితే సాయంత్రం మదనపల్లిలో జరిగే ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button