తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Gaami: ఓటీటీలోకి విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ఈ మూవీ మార్చి 8న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిచగా.. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మించారు. ఇందులో హీరోయిన్‌గా చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ తదితరులు నటించారు. తాజాగా, ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.

ALSO READ: ఓటీటీలోకి రానున్న ‘కాజల్ కార్తీక’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏప్రిల్ రెండో వారంలో..

‘గామి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ సొంతం చేసుకుంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ చిత్రాన్ని వీక్షకుల ముందుకు తీసుకు రానుంది. ఏప్రిల్ 12వ తేదీన డిజిటల్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకిరావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు నరేష్ కుమారన్ సంగీత దర్శకుడిగా, విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button