తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Rashmi Gautham: అమెరికా అబ్బాయితో రష్మీ పెళ్లి.. హింట్ ఇచ్చిన జబర్ధస్త్ కమెడియన్?

టీవీ యాంకర్ రష్మి గౌతమ్ పెళ్లి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె పెళ్లి విషయంపై జోష్యం చెప్పారు జబర్దస్త్ కమెడియన్. ఆమె అమెరికా అబ్బయిని పెళ్లిచేసుకోబోతుందంటూ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ కమెడియన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్ లో భాగంగా బులెట్ భాస్కర్ ఒక స్కిట్ చేశారు.

Also read: Pathaan2: పఠాన్ 2 నుంచి కీలక అప్డేట్.. కొత్త డైరెక్టర్ తో ప్రాజెక్టు?

ఈ స్కిట్ లో భాగంగా.. రాజు గెటప్ లో కనిపించిన బులెట్ భాస్కర్ రష్మీ దగ్గరకు వెళ్లి.. మన బాబు జీతాలు బాగానే ఇస్తున్నట్టున్నాడు కామెంట్స్ చూస్తే అర్థమవుతోందని అన్నాడు. దానికి రష్మీ నవ్వేసింది. అనంతరం స్టేజిపైకి వచ్చిన బులెట్ భాస్కర్ ను తన అసిస్టెంట్ సుధీర్, రష్మీకి పెళ్లి అవుతుందా? అని అడుగుతాడు. దానికి సమాధానంగా.. నిన్ననే జాతకాలు చూపించా. పెళ్లి అవుతుంది కానీ, రష్మీకి అమెరికా అబ్బాయితో.. సుధీర్ కు అమలాపురం అమ్మాయితో అని అంటారు. దాంతో ఒక్కసారిగా స్టేజీపై నవ్వుల పువ్వులు పూశాయి.

స్కిట్ లో భాగంగా జరిగినప్పటికీ ఆడియన్స్ మాత్రం నిజంగానే చెప్పాడని అనుకుంటున్నారు. నిజానికి చాలా కాలంగా సుధీర్, రష్మీ పెళ్లిపై వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ, ఈ ఇద్దరు మాత్రం ఇప్పటివరకు రెస్పాండ్ అవలేదు. ఫ్యాన్స్ మాత్రం ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button