తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Premalu: ఏప్రిల్ 12 నుంచి ఓటీటీలోకి రానున్న ‘ప్రేమలు’!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ప్రేమలు’ తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. గిరీష్ ఏడీ తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులో ఎస్.ఎస్. కార్తికేయ విడుదల చేశారు. కేవలం రూ. 10 కోట్లతో తెరకకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. మంచి టాక్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఓటీటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి ఓ అప్డేడ్ అందింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఏప్రిల్ 12 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ALSO READ: అమెరికా అబ్బాయితో రష్మీ పెళ్లి.. హింట్ ఇచ్చిన జబర్ధస్త్ కమెడియన్?

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఇందులో హీరో, హీరోయిన్లుగా స్లీన్‌, మమితా బైజు నటించారు. భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫాహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీం తదితరులు ఈ సినిమాలో నటించారు.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button