తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Chiranjeevi: మీరేమైనా సూపర్‌ స్టార్లు అనుకుంటున్నారా? ఈ మాటలకు గుండె పిండేసినంత పనైంది!

మెగాస్టార్‌ చిరంజీవి తెలుగు డిజిటల్‌ మీడియా ఫెడరేషన్‌ వేడుకల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితోపాటు విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. జీవితంలో ఎక్కడా షార్ట్‌కట్స్‌ ఉండవని, ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుని ఇక్కడికి వచ్చాంటూ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన పంచుకున్నారు. ‘న్యాయం కావాలి’ సినిమా షూటింగ్‌ సమయంలో నిర్మాత క్రాంతి కుమార్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.

ALSO READ: ముందుగానే ఓటీటీలోకి రానున్న గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

భోజనం కూడా చేయబుద్ధి కాలేదు..

‘నేను బయట ఉన్నాను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పిలవడంతో నేను గబాగబా వచ్చి బోనులో నిల్చున్నాను. లోపలికి రాగానే ఓ క్రేన్‌లో పై ఉన్న క్రాంతికుమార్‌ అందరి ముందు అవమానిస్తూ మాట్లాడడంతో నాకు గుండె పిండేసినంత పనైంది. ఏంటండీ? మిమ్మల్ని కూడా పిలవాలా? ఇక్కడ వచ్చి పడుండలేరా? మీరేమైనా సూపర్‌ స్టార్లు అనుకుంటున్నారా? ఇక్కడ జగ్గయ్య, శారద వంటి యాక్టర్లు లేరా? ఇక్కడే ఉండండి అని అరిచేశారు. ఆ మాటలకు మధ్యాహ్నం భోజనం కూడా చేయబుద్ధి కాలేదు.’ అని చెప్పుకొచ్చారు.

ALSO READ: ఏప్రిల్ 12 నుంచి ఓటీటీలోకి రానున్న ‘ప్రేమలు’!

ఆరోజే డిసైడయ్యా..

క్రాంతికుమార్‌ అదే రోజు ఫోన్‌ చేసి మాట్లాడారు. నేను ఏదో ఒత్తిడిలో ఉండి ఆ కోపం నా మీద చూపించానని సాయంత్రం ఇంటికెళ్లాక చెప్పారు. అయితే అది పద్ధతి కాదు. అందరి ముందు అలా మాట్లాడితే ఎంత అవమానానికి గురై ఉంటా. సూపర్‌స్టార్‌ అనుకుంటున్నావా? అనే మాటలె నా మనసులో ఉండిపోయాయి. దీంతో ఆరోజే స్టార్‌నయి చూపిస్తానని డిసైడయ్యాను. నిజం చెప్పాలంటే ఆ మాటలను నాలో కసి పెరిగింది. కానీ ఆయనపై ప్రతీకారం తీర్చుకోకుండా ఆ అవమానాన్ని నా ఎదుగుదలకు వాడుకున్నాను. ఇలాంటివి చాలా జరిగాయి’ అని చెప్పుకొచ్చాడు.

8 Comments

 1. Do you have a spam problem on this site; I also am a blogger, and I was wanting
  to know your situation; many of us have created some nice practices and
  we are looking to exchange solutions with others, please shoot me an e-mail if interested.

  Have a look at my blog post … vpn code 2024

 2. Fantastic items from you, man. I’ve have in mind your stuff previous to and you’re just too magnificent.
  I really like what you’ve bought here, really like what you are saying and the way through which you assert it.
  You’re making it enjoyable and you still take care of to stay it smart.

  I cant wait to learn much more from you. This is really a tremendous web
  site.

  Feel free to visit my page vpn coupon 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button