తెలుగు
te తెలుగు en English
జాతీయం

K Kavitha: బెయిల్ కోసం కవిత పిటిషన్… వాయిదా వేసిన కోర్టు

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు నేడు వాదనలు విని… తదుపరి విచారణను వాయిదా వేసింది. కవిత తరఫు లాయర్లు, ఈడీ తరఫు లాయర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు.

Also Read: ఏపీలో సామూహిక రాజీనామాలు చేసిన వాలంటీర్లు

మెరిట్ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయంటూ బెయిల్ కోరుతూ కోర్టుకెళ్లారు కవిత. ఏప్రీల్ 16వ తేదీ వరకు బెయిల్ కావాలంటూ పిటిషన్ వేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరుఫున న్యాయవాది సింఘ్వీ విచారణకు హాజరయ్యారు. కవిత బెయిల్ పై ఈడీ టెక్నికల్ ఇష్యూలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లిక్కర్ స్కాం కేసులో కవిత విచారణకు సహకరించినా.. అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. లిక్కర్ స్కాం FIRతోపాటు అరుణ్ పిళ్లై 9 స్టేట్మెంట్లలో కవిత పేరు లేదన్నారు. కానీ పదో వాంగ్మూలం పూర్తి విరుద్దంగా ఉందని సింఘ్వీ అన్నారు. బుచ్చిబాబు స్టేట్మెంట్ లో విజయ్ నాయర్ తో సంభాషణపై ఎలాంటి ప్రస్తావన చెప్పలేదని కోర్టుకు వివరించారు.

Also Read:  ఢిల్లీ లిక్కర్ స్కామ్… తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్

కవిత బెయిల్ పై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రిప్లై ఇచ్చామని ఈడీ అధికారులు తెలిపారు. కొన్ని టెక్నికల్ అంశాలను పరిశీలించాలని జడ్జిని కోరారు. దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలను ఈనెల 4వ తేదీకి వాయిదా వేశారు. ఈడీ రిప్లై రిజాయిండర్‌కు కవిత తరఫు న్యాయవాదులు సమయం కోరారు. ఏప్రిల్ 3 సాయంత్రానికి రిజాయిండర్ దాఖలు చేస్తామని వెల్లడించారు. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. గురువారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ చేపట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button