తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Mumbai Indians: రూల్స్ అతిక్రమించిన ఇషాన్ కిషన్.. వింతైన శిక్ష వేసిన మేనేజ్ మెంట్

టీం నిబంధనలు ఉల్లంఘించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు మేనేజ్మెంట్ వెరైటీ శిక్ష విధించింది. రోజంతా సూపర్ హీరో జంప్‌సూట్‌ ధరించాల్సిందిగా ఆదేశించింది. దాంతో కిషన్ ఒంటిపై ఆ దుస్తులు ధరించే చక్కర్లు కొట్టాడు. కిషన్ ఫన్నీ సూపర్ హీరో సూట్‌‌లో ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read: Wanindu Hasaranga: సన్ రైజర్స్ టీంకు బిగ్ షాక్.. జట్టుకు కీలక ప్లేయర్ దూరం

కిషన్‌ గతంలో కూడా ఇలాంటి శిక్షను ఎదుర్కొన్నాడు. రూల్స్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్లు కఠినంగా వ్యవహరిస్తుంటాయి. ప్రాక్టీస్‌కు ఆలస్యంగా రావడం లేదా హోటళ్లలో కాల్ సమయాలను పాటించకపోవడం వంటి నిబంధనల్లో ఆటగాళ్లను క్రమశిక్షణలో ఉంచడానికి వెరైటీ శిక్షలు విధిస్తుంటాయి. ప్రతి సీజన్‌లో ప్రత్యేకమైన దుస్తులను సిద్ధం చేసి రూల్స్ అతిక్రమించిన ఆటగాడు రోజంతా దాన్ని ధరించేలా చేస్తారు.

ఐపీఎల్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియ‌న్స్.. ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎవరికి వారు అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇంకా గెలుపు రుచి చూసింది లేదు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button