తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Wanindu Hasaranga: సన్ రైజర్స్ టీంకు బిగ్ షాక్.. జట్టుకు కీలక ప్లేయర్ దూరం

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా శ్రీలంక స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. త్వరలోనే అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ క్యాంప్‌లో చేరతాడని భావించినప్పటికీ.. మొత్తం టోర్నీ నుంచే అతను వైలిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Also read: Babar Azam: పాక్ క్రికెట్ లో కెప్టెన్సీ లొల్లి.. బాబర్ కే మళ్లీ పగ్గాలు

ప్రస్తుతం హసరంగా ఎడమ మడమ గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవల పాడియాట్రిస్ట్‌ను కలిసిన హసరంగా.. వారి సలహా మేరకు కొంత విశ్రాంతి తీసుకోవలసి ఉండటంతో ఐపీఎల్ నుండి వైదొలిగాడు. మడమలో వాపు ఉందని, ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ ఆష్లే డి సిల్వా తెలిపారు. అతను ఈ సమస్యను ప్రపంచ కప్‌కు ముందే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. హసరంగా త్వరలోనే తన మడమ గాయానికి సంబంధించి నిపుణుడి సలహా తీసుకోవడానికి దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం.

గతేడాది డిసెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 1.50 కోట్ల రూపాయలకు వనిందు హసరంగాను కొనుగోలు చేసింది. ఈ మిస్టరీ స్పిన్నర్ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. అదే జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ భాగమైనప్పటికీ.. ఐసీసీ ఆంక్షల నేపథ్యంలో రెండు టెస్టుల నిషేధాన్ని అనుభవిస్తున్నాడు.

8 Comments

  1. After looking into a few of the blog articles on your website, I really appreciate your way
    of writing a blog. I added it to my bookmark site list and will
    be checking back in the near future. Please check out my website as well and tell me your opinion.

    my web page; vpn coupon code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button