తెలుగు
te తెలుగు en English
జాతీయం

ECI: ఎన్నికల అభ్యర్థులకు ఈసీ ఝలక్.. ఇక నుంచి కొత్త రూల్స్

దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటుక్కుతోంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి రంగంసిద్దం చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించారు కూడా.. దీంతో ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతుండగా.. ఎన్నికల కమిషన్ పార్టీలకు ఝలక్ ఇచ్చింది. ఎన్నికలకు ప్రచారం నిర్వహించే అభ్యర్థులు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని కొత్త రూల్​ ప్రవేశపెట్టింది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైనా ప్రచారాలకు సంబంధించి 48 గంటల ముందు సువిధ అనే యాప్‎లో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న 24 గంటల్లోనే అనుమతి వస్తుందని తెలిపింది.

Also read: Modi: మ్యాచ్ ఫిక్సింగ్‌కి ప్రయత్నిస్తున్న బీజేపీ… ఎన్నికలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచార వేడి కనిపిస్తుంది. పోలింగ్‎కి ఇంకా 40 రోజులుపైనే సమయం ఉన్నా రాజకీయ పార్టీలు ప్రచారంలో తగ్గేదెలే అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ప్రచారంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఎన్నికలకు ముందు మరో ఎత్తు అనేలా ఎన్నికల కమిషన్ ప్రచారంలో తొలిసారిగా ఆంక్షలు పెట్టింది. ప్రచారాలకు సంబంధించి సమాచారం ముందుగా ఇవ్వాలని కొత్త యాప్ రూపొందించింది.

మీటింగ్, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక ఎలక్షన్ ఆఫీస్, లౌడ్ స్పీకర్, హెలికాప్టర్, హెలిప్యాడ్, డోర్ టు డోర్ ప్రచారం, డిస్ ప్లే బ్యానర్స్, జెండాలు, ఎయిర్ బెలూన్స్, హోర్డింగులు, బ్యానర్లు, వీడియో వ్యాన్ మొదలైన అనుమతులు పొందేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా సువిధ పోర్టల్‎లో దరఖాస్తు చేసుకునేలా ఇచ్చే ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. అలాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్దనే అనుమతి తీసుకునేందుకు వీలుగా కూడా సువిధ కౌంటర్‎ను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

10 Comments

  1. Hey would you mind sharing which blog platform you’re using?
    I’m planning to start my own blog soon but I’m having a hard time choosing between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
    The reason I ask is because your layout seems different then most blogs and I’m looking for something completely unique.
    P.S My apologies for getting off-topic but I had to ask!

    My webpage: vpn coupon code 2024

  2. Wow that was odd. I just wrote an extremely long
    comment but after I clicked submit my comment didn’t appear.
    Grrrr… well I’m not writing all that over again. Regardless, just
    wanted to say fantastic blog!

    Also visit my webpage; vpn 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button