తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే పెత్తందారులకు గిట్టదా?

అవ్వాతాతలు, దివ్యాంగులకు మళ్లీ కష్టాలు రానున్నాయి. ఒకప్పుడు టీడీపీ హయాంలో పింఛన్‌ పొందేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు పడాల్సి వచ్చేది. కొన్ని చోట్ల వారంరోజులుగా తిప్పుకునేవారు. అర్హులు ఉన్నప్పటికీ మండలంలో కొంతమందికి మాత్రమే పింఛన్లు అందించి మిగతా వారికి కోత విధించేవారు. ఇక జన్మభూమి కమిటీలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ప్రతీ నెలా ఇచ్చే పింఛన్‌లోనూ రూ.100, 200 వరకు కోత విధించి నానా తిప్పలు పెట్టేవారు. కానీ వైసీపీ పాలనలో పింఛన్‌దారుల కష్టాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. కానీ, పేదలకు మేలు చేసే ఈ వ్యవస్థ అంటే పెత్తందారులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నిమ్మగడ్డ రమేష్, ఎల్లో మీడియాలకు గిట్టడం లేదు. కేవలం చంద్రబాబు కూటమి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలతోనే అవ్వాతాతలకు, దివ్యాంగులకు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి.

ALSO READ: ఐదోరోజుకు చేరుకున్న ‘బస్సుయాత్ర’.. జననేతకు బ్రహ్మరథం!

టీడీపీ కుట్రలే కారణమా?

టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్ల వ్యవస్థను పలుమార్లు తప్పుబట్టారు. వీరికి కొన్ని ప్రముఖ పత్రికల యాజమాన్యాలు తోడై ఇష్టానుసారంగా వార్తలు రాసేవారు. తాజాగా, నిమ్మగడ్డ రమేష్ లాంటి వ్యక్తులు కారణంగా ఇంటి వద్దనే నిశ్చింతగా పింఛన్‌ తీసుకుంటున్న అవ్వాతాతలు, దివ్యాంగులు టీడీపీ కుట్రలతో గడపదాటాల్సి వస్తోంది. రాష్ట్రంలో 70 శాతం మందికిపైగా అవ్వాతాతలు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. వీరిలో 10 శాతం మంది మంచానికే పరిమితం అయ్యారు. ముఖ్యంగా డయాలసిస్‌, కిడ్నీ రోగులు అడుగుతీసి అడుగు వేయలేరు. ఇటీడీపీ కుట్రలతో వీరంతా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలి. సచివాలయాలకు వచ్చి పింఛన్లు పొందాలంటే వీళ్లందరినీ ఎత్తుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: ఎన్నికల అభ్యర్థులకు ఈసీ ఝలక్.. ఇక నుంచి కొత్త రూల్స్

చంద్రబాబు డబుల్ గేమ్..

జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు మాత్రం పేదలకు మేలు చేసే వ్యవస్థలపై కక్ష పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పింఛన్లపై డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఒకవైపు పింఛన్లను అడ్డుకుంటూనే మరోవైపు సకా­లంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం ఏంటో అర్థం కావడం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు మరోసారి దిగజారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గ్రామ, వార్డు సచి­వాలయ వ్యవస్థలో భాగంగా ప్రభు­త్వం నియమించిన వలంటీర్లతో వివక్ష, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా పేద­లు పారదర్శకంగా లబ్ధి పొందడం టీడీపీకి, ఎల్లో మీడియా­లకు గిట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే సిటిజన్‌ డెమొక్రటిక్‌ ఫోరం పేరుతో తెర వెనుక రాజకీయాలు నడిపినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button