తెలుగు
te తెలుగు en English
టెన్నిస్

Tennis: మియామి ఓపెన్ టైటిల్… రికార్డు సృష్టించిన రోహన్ బోపన్న జోడీ

మియామి ఓపెన్ టైటిల్ గెలిచి భార‌త్ టెన్నిస్ స్టార్ రోహ‌న్ బోప‌న్న కొత్త ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. పురుషుల డబుల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో క‌లిసి అదరగొట్టాడు. పురుషుల డబుల్స్‌ ఫైనల్‌లో 6-7 (7-3), 6-3, 10-6 తేడాతో ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా), ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా) పై బోపన్న జోడీ విజ‌యం సాధించింది. ఈ పోరులో బోపన్న ద్వ‌యం తొలి గేమ్‌లో వెనుకబడ్డా తర్వాత పుంజుకుని వరుస గేమ్స్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసింది.

Also Read: ఓ వైపు పరుగుల వరద.. మరోవైపు రికార్డుల మోత.. దటీజ్ ధోనీ!

ఇక ఈ విజయం ద్వారా 44 ఏళ్ల‌ వయసులో ‘ఏటీపీ మాస్టర్స్‌ 1000’ టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా బోపన్న కొత్త‌ చరిత్ర సృష్టించాడు. బోపన్నకు ఇది 14వ ఏటీపీ మాస్టర్స్‌ ఫైనల్‌ కాగా ఆరో మాస్టర్స్‌ టైటిల్‌. మొత్తంగా అతడి కెరీర్‌లో ఇది 26వ డబుల్స్‌ టైటిల్‌. అలాగే ఓపెన్ చ‌రిత్ర‌లో అన్ని మేజ‌ర్ టోర్నీల‌లో డ‌బుల్స్ టైటిల్స్ నెగ్గిన మూడో ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డుకెక్కాడు. ఇంత‌కుముందు లియాండ‌ర్ పేస్‌, మ‌హేశ్ భూప‌తి ఇలా ఏటీపీ టైటిల్స్ సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button